మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఖిలాడి సినిమాలో హీరోగా నటిస్తున్నాడు, ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కు సంబంధించిన ప్రచార చిత్రాలను, టీజర్, పాటలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి అదిరి పోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఈ సినిమాపై ఉన్న అంచనాలు అమాంతం పెంచేశాయి. ఇలా జనాలలో ఇప్పటికే ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసిన ఖిలాడి సినిమా విడుదల తేదీని తాజా గా చిత్ర బృందం ప్రకటించింది. 11 ఫిబ్రవరి 2022 లో ఖిలాడి సినిమా ను థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది. పేన్ మూవీస్, ఏ స్టూడియోస్ ఎల్ ఎల్ పి సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఖిలాడి సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చాడు.

ఖిలాడి సినిమాకు ప్లే స్మార్ట్ టాగ్ లైన్ ను కూడా జోడించారు. రవితేజసినిమా తో పాటు రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమా షూటింగ్ ను కూడా శర వేగంగా పూర్తి చేస్తున్నాడు, ఈ సినిమాలో రవితేజ పవర్ ఫుల్ ఎమ్మార్వో ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను కూడా ఆ చిత్ర బృందం ఇప్పటికే విడుదల చేసింది. ఇలా ఈ రెండు సినిమాల షూటింగ్ లను శరవేగంగా పూర్తి చేసుకున్న రవితేజ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ధమాకా సినిమాతో పాటు సుధీర్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమాలో, టైగర్ నాగేశ్వరరావు సినిమాలో నటించడానికి రెడీ గా ఉన్నాడు, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనలు కూడా జరిగిపోయాయి. ఈ సంవత్సరం ఇప్పటికే క్రాక్ సినిమా తో బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం అందుకున్న రవితేజ ప్రస్తుతం వరుస సినిమా లను లైన్ లో పెడుతూ ఫుల్ జోష్ లో ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: