స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం "పుష్ప". ఆర్య,ఆర్య-2 లాంటి సూపర్ హిట్ సినిమా తరువాత హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి పుష్ప సినిమాతో రెడీగా ఉన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను డైరెక్టర్ రెండు భాగాలుగా తీస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తొలి భాగం క్రిస్మస్ కానుకుగా డిసెంబర్‌17న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పాటలు..ఫస్ట్ లుక్స్.. సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పేశాయి. ఇక పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమా పై అభిమానులకు భారీ అంచనాలే ఉన్నాయి.

ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో సుకుమార్ ప్రమోషన్స్ లో భాగంగా సినిమా నటులకు సంబంధించి ఒక్కోక్కరి లుక్ ను రివీల్ చేస్తున్నారు. తాజాగా జబర్ధస్త్ బ్యూటి అనసూయ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు.  దాక్షాయణిగా అనసూయ  పాత్రను పరిచయం చేశారు దర్శక నిర్మాతలు. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రతో అందరిని మెప్పించిన  అనసూయ.. ఈ సినిమాలో నెగిటివ్ రోల్ లో నటిస్తుంది. ఇక ఈ పోస్టర్ లో అనసూయ లోని  మరో కోణాన్ని మనకు చూపించాడు దర్శకుడు సుకుమార్.


దాక్షాయనిగా అనసూయ.. నోట్లో ఆకు నములుతూ.. మాస్ లుక్ లో..చేతిలో అడకత్తెర పట్టుకుని పోకచెక్కలు పగల గొడతున్నట్లు చూయించారు. ఈ సినిమాలో అనసూయ సునీల్ కు భార్య గా నటిస్తుంది. ఇక పుష్ప  సినిమా నుండి రిలీజ్ అయిన అనసూయ ఫస్ట్  లుక్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇంత  వరకు బాగానే ఉంది కానీ ఇక్కడే పుష్ప టీం నెటిజన్స్ కు అడ్డంగా దొరికిపోయింది. మనం చూసిన్నట్లైతే  అనసూయ ఉన్న ఈ పోస్టర్ లో ఆమెను దాక్షాయనిగా పరిచయం చేసారు. కానీ ముందు రోజు మాత్రం ఆమెను ద్రాక్షాయనిగా మనకు పరిచయం చేస్తున్నట్లు పోస్ట్ చేసారు. ఇక ఇక్కడే సుకుమార్ అడ్డంగా బుక్కైయ్యాడు. పాన్ ఇండియా రేంజ్ సినిమా అంటూ గొప్పలు చెప్పుకునే సుకుమార్ ఆయన సినిమా విషయంలో కనీస జాగ్రత్తలు తీసుకోరా అంటూ  నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. కాని కొందరు మాత్రం ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అంటూ కొట్టిపారేస్తున్నారు. పేరు ఎలా ఉన్నా అనసూయ లుక్ అద్దిరిపోయిందనే చెప్పాలి. మరి చూడాలి ఈ సినిమా అనసూయకి ఎలాంటి పేరు తీసుకువస్తుందో..!!


మరింత సమాచారం తెలుసుకోండి: