అక్కినేని వారి మూడవతరం వారసుడు అక్కినేని నాగ చైతన్య కొన్నాళ్ల క్రితం తన మావయ్య వెంకటేష్ తో కలిసి చేసిన వెంకీ మామ సినిమాతో మంచి సక్సెస్ సొంతం చేసుకున్నారు. ఇక ఇటీవల శేఖర్ కమ్ముల తీసిన లవ్ స్టోరీ మూవీ తో మరొక సూపర్ హిట్ కొట్టిన చైతన్య ప్రస్తుతం ఒక్కొక్కటిగా సినిమాలు ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు.

సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన లవ్ స్టోరీ సినిమా యువత తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించి థియేటర్స్ లో మంచి కలెక్షన్ అందుకుని నిర్మాతలకు బాగా లాభాలు తెచ్చిపెట్టి చైతు కెరీర్ కి మరింతగా బూస్ట్ ని ఇచ్చింది అనే చెప్పాలి. ఇక ప్రస్తుతం చైతన్య చేస్తున్న సినిమా థాంక్యూ. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై విక్రమ్ కె కుమార్ తీస్తున్న ఈ సినిమాలో నాగ చైతన్య, సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానిగా కనిపించనున్నారని, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు టాక్. గతంలో అఖిల్ తో హలో సినిమా తీసి మంచి పేరు దక్కించుకున్న విక్రమ్ కుమార్, దీనిని మరింత అద్భుతంగా తీస్తున్నారని ఇన్నర్ వర్గాల టాక్.

బివిఎస్ రవి కథ ని అందిస్తున్న ఈ సినిమాకి యువ సంగీత తరంగం థమన్ మ్యూజిక్ అందిస్తుండగా పిసి శ్రీరామ్ ఫోటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. రాశి ఖన్నా, మాళవికా నాయర్, అవికా గోర్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాపై అక్కినేని ఫ్యాన్స్ లో భారీగానే అంచనాలు ఉన్నాయి. ఇక మొత్తంగా ఇన్నర్ వర్గాల నుండి అందుతున్న న్యూస్ ప్రకారం సినిమా కూడా బాగా రూపొందుతుండడంతో తప్పకుండా చైతు దీనితో మరొక సూపర్ హిట్ కొట్టి తీరుతాడని అంటున్నారు. కాగా ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి లో విడుదల కానున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: