తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది గొప్ప గాయని గాయకులు ఉన్న విషయం తెలిసిందే.. వారు తమ మధుర స్వరంతో వినసొంపైన పాటలతో ప్రేక్షకులను మైమరపిస్తూ ఉంటారు.. ముఖ్యంగా సంగీత ప్రియులకు వీరు పాడే పాటలు ఎంత మధురంగా అనిపిస్తాయి అంటే విన్న వారికి మాత్రమే ఆ మధురానుభూతి తెలుస్తుంది అని అంటారు సంగీత ప్రియులు. అలా ఎంతో మంది సినీ ఇండస్ట్రీలో, ఎన్నో మంచి మంచి పాటలతో బాగా పాపులారిటీని అందుకున్న గాయకులలో గాయని శ్రావణ భార్గవి కూడా ఒకరు. ఈరోజు ఈమె గురించి ఎవరికీ తెలియని కొన్ని ప్రత్యేక విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

1989 ఆగస్టు 16వ తేదీన తెలంగాణ లో జన్మించిన శ్రావణ భార్గవి.. విజ్ఞాన్ కళాశాల నుండి హైదరాబాద్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన శ్రావణ భార్గవి ఎమ్ బీ ఏ కూడా పూర్తి చేసింది. సంగీతంపై మక్కువ ఎక్కువ ఉండడంతో సంగీత శిక్షణను కొనసాగిస్తూనే పలు పోటీలలో పాల్గొని విజేతగా నిలిచింది శ్రావణ భార్గవి. ఇక ఆ తర్వాత సినిమాలలో ఈమె ఎన్నో పాటలు పాడి మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత హీరోయిన్లకు డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా పనిచేసింది. ముఖ్యంగా గబ్బర్ సింగ్ , లవ్ ఫెయిల్యూర్ వంటి సినిమాలలో  డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పనిచేసిన శ్రావణ భార్గవి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది.

ఇక ప్లేబ్యాక్ సింగర్ గా గుర్తింపు పొందిన ఈమె సింహా సినిమాలో  సింహ మంటి చిన్నోడే వేటకొచ్చాడే.. తీన్ మార్ లో ఆలే బాలే.. బార్బీ బొమ్మకి, ఖలేజాలో భూమ్ షకనక , బద్రీనాథ్ సినిమాలో అంబదరి, ఇలా మంచి మంచి పాటలతో సినీ ఇండస్ట్రీని షేక్ చేసింది . ఆ తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ,కెమెరామెన్ గంగతో రాంబాబు, కృష్ణం వందే జగద్గురం ,రాజన్న, సోలో, దమ్ము, రెబల్ ,కందిరీగ వంటి ఎన్నో సినిమాలలో పాటలు పాడి  తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది.

ఇక గాయకుడు అలాగే సంగీత దర్శకుడైన హేమచంద్ర ను ప్రేమ వివాహం చేసుకుంది. అంతేకాదు బిగ్ ఎఫ్ఎం లో ఒక కార్యక్రమానికి ఈమె రేడియో జాకీగా కూడా పనిచేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: