పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా హరీష్ శంకర్ దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో భగవదీయుడు భగత్ సింగ్ అనే చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు అనౌన్స్ చేసి చాలా కాలం అవుతున్న ఈ సినిమా మాత్రం ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ ను పవన్ కళ్యాణ్ శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే ను అందిస్తున్నాడు, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు దగ్గుబాటి రానా కూడా హీరోగా నటిస్తున్నారు, ఇప్పటికే ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ ఇప్పటికే కొంత భాగం పూర్తి చేసిన హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో పాల్గొన్నబోతున్నాడు, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇలా పవన్ కళ్యాణ్ ఈ రెండు సినిమా లతో ఫుల్ బిజీగా ఉండడంతో హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోయే భగవదీయుడు భగత్ సింగ్ సినిమా ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కు గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందించాడు. ఇలా హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఇది వరకు వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్ బాస్టర్ అవడంతో వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే భగవదీయుడు భగత్ సింగ్ సినిమా కోసం పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు మామూలు ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలతో పాటు టాలీవుడ్ లో స్టైలిష్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా ఒక సినిమాలో నటించడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: