బిగ్ బాస్ ప్రస్తుతంబుల్లితెర ప్రేక్షకులందరి చూపులు ఆకర్షిస్తుంది. అయితే గత సీజన్లో తో పోల్చి చూస్తే బిగ్బాస్ సీజన్ అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.. ఇక తమకు తెలిసిన సినీ సెలబ్రిటీల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది బుల్లితెర ప్రేక్షకులు బిగ్బాస్ కార్యక్రమం చేస్తున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవలే బిగ్ బాస్ హౌస్ లో బీబీ హోటల్ అనే టాsస్క్ కంటెస్టెంట్ కు ఇచ్చారు.  ఇక ఈ టాస్క్ లో భాగంగా ప్రతి ఒక్కరూ పాత్రలో లీనం కావడం తో అందరికీ ఎంతగానో తెగ నచ్చేసింది. కొంత ఎంటర్టైన్మెంట్ కూడా అందింది.


 అయితే  ఇటీవలే కెప్టెన్సీ పోటీదారులకు మరో స్పెషల్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్ మొత్తం రచ్చ రచ్చగా అయిపోయింది అని చెప్పాలి. అయితే ఇటీవలే బిగ్బాస్ ఈరోజు ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా.. బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు కూల్గా ఉండే షణ్ముఖ్ జస్వంత్ ఒక్కసారిగా కోపంతో ఊగిపోయాడు. అయితే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఫైర్ బ్రాండ్ గా పేరుతెచ్చుకున్నాడు సన్నీ. కాస్త ఎక్కడైనా తేడా జరిగింది అంటే చాలు ఏకంగా కోపంతో ఊగిపోతూ ఉండేవాడు. ఇటీవలే నాగార్జున చెప్పడంతో తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నాడు.



కానీ ఇటీవలే మరో సారి కోపంతో ఊగిపోయాడు సన్నీ. బిగ్బాస్ కెప్టెన్సీ పోటీదారులకు ఇచ్చిన టాస్క్ లో భాగంగా సిరి సన్నీ ని టార్గెట్ చేస్తూ గేమ్ ఆడుతుంది. ఇక తనను టార్గెట్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తాడు సన్నీ. అప్పడంలా నలిపేస్తాను అంటూ వార్నింగ్ ఇస్తాడు. ఇక ఆ సమయంలో ఉన్న షణ్ముక్ అప్పడం అని అనకు అంటూ చెప్పడంతో నువ్వు సైలెంట్ గా ఉండు నీకు ఈ గొడవతో సంబంధం లేదుఅంటూ షణ్ముఖ్ జస్వంత్ మీద అరుస్తాడు సన్నీ. దీంతోఅప్పటివరకు కూల్ గా ఉన్న షణ్ముఖ్ జస్వంత్ ఒక్కసారిగా కోపంతో ఊగిపోతాడు. సన్నీ కాదు అంతకంటే ఎక్కువ అనే రేంజ్ లోనే కోపంతో ఊగిపోయి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తాడు షణ్ముఖ్ జస్వంత్.

మరింత సమాచారం తెలుసుకోండి: