అందాల ముద్దు గుమ్మ రాశి కన్నా నాగ శౌర్య హీరో గా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, మొదటి సినిమా లోనే తన అందంతో, అభినయంతో, నటనతో ఎంతో మంది ప్రేక్షకులను అలరించిన ఈ హాట్ బ్యూటీ తెలుగు పరిశ్రమలో క్రేజీ సినిమా ఆఫర్ లను అందుకుంది. అందులో భాగంగా ఈ హాట్ బ్యూటీ తొలిప్రేమ, సుప్రీమ్, వరల్డ్ ఫేమస్ ఫ్లవర్, హైపర్, బెంగాల్ టైగర్, శివమ్, శ్రీనివాస కళ్యాణం, వెంకీ మామ, జిల్ వంటి తెలుగు సినిమాలలో నటించి టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది. ప్రస్తుతం కూడా ఈ హాట్ బ్యూటీ నాగ చైతన్య హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న థాంక్యూ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది,  ఈ సినిమా తో పాటు గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పక్కా కమర్షియల్ లో కూడా రాశి కన్నా హీరోయిన్ గా నటిస్తోంది.

ఇలా వరుస సినిమా లతో ఫుల్ బిజీగా ఉన్న రాశి కన్నా సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది, సోషల్ మీడియా వేదికగా తన షూటింగ్ అప్ డేట్స్ ను, తన డైలీ ఆక్టివిటీస్ ను తన అభిమాను లతో పంచుకునే రాశి ఖన్నా అప్పు డప్పుడు తన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటో లను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజా గా కూడా రాశి కన్నా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది, ఈ ఫోటోలలో రాసి కన్నా పూల చీర కట్టుకొని, స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించింది. ఇలా రాశి కన్నా అంద చందాల తో కూడిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: