తొలిసారిగా ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాపై వారి వారి అభిమానులతో పాటు పలు ఇతర దేశాల ఆడియన్స్ లో కూడా విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ఈ సినిమాలో కొమరం భీం పాత్ర చేస్తుండగా చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. ఎన్టీఆర్ కి జోడీగా హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్, అలానే చరణ్ కి జోడీగా బాలీవుడ్ నటి అలియా భట్ నటిస్తున్న ఈ సినిమాని ఎంతో గ్రాండ్ లెవెల్లో దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తుండగా దానయ్య ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు.

పేట్రియాటిక్ డ్రామా మూవీగా అలానే భారీ యాక్షన్ కమర్షియల్ హంగులతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకోగా ప్రస్తుతం పోస్ ప్రొడక్షన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఇద్దరు హీరోల టీజర్స్, అలానే రెండు సాంగ్స్ అందరినీ ఎంతో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మూడు రోజుల క్రితం రిలీజ్ అయిన నాటు నాటు సాంగ్ కి అయితే యూట్యూబ్ లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

ముఖ్యంగా యువత తో పాటు మాస్ ఆడియన్స్ మనసు దోచిన ఈ సాంగ్ లో ఎన్టీఆర్, చరణ్ కలిసి వేసిన అద్భుతమైన స్టెప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతూ ఉండగా, ఇది కేవలం శాంపిల్ మాత్రమే అని, ఆర్ఆర్ఆర్ సినిమాలో ఇంతకు మించిన ఆడియన్స్ ఊహించని అద్బుతాలు ఎన్నో దాగి ఉన్నాయని, ఈ మాత్రం దానికే ఇంతిదైపోతే ఏముంది, అసలు సినిమా ముందుందని, రేపు రిలీజ్ తరువాత ఆర్ఆర్ఆర్ భారీ బ్లాక్ బస్టర్ ఖాయం అని యూనిట్ ఆశాభావము వ్యక్తం చేస్తోందట. కాగా ఈ సినిమాని 2022, జనవరి 7న భారీ స్థాయిలో విడుదల చేయనున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: