బిగ్ బాస్ హౌస్ లో గొడవలు చిలికి చిలికి గాలివానగా మారిందన్న సామెతగా తయారయ్యాయి. హౌస్ లో ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో తెలియక ప్రేక్షకులు తలపట్టుకుంటున్నారు. ఇప్పటి తొమ్మిది వరాలను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ హౌస్ 10వ వారాన్ని కూడా సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. 10వ వారం ఎలిమినేషన్ టైం రానే వచ్చింది. హౌస్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్న ప్రశ్నకంటే హౌస్ బయట జరిగే చర్చలు ప్రేక్షకులను షాక్ కి గురిచేస్తున్నాయి . తాజాగా ఈ వారం  కెప్టెన్సీ దారుల టాక్స్ లో సన్నీ కి సిరి కి మధ్య జరిగిన సంభాషణ చిలికి చిలికి గాలివానగా తయారయ్యింది.




 సిరి ని సన్నీ టార్గెట్ చేసేప్పుడు షణ్నూ ఎంటర్ అయ్యాడు. సిరి సన్నీ గొడవ కాస్త షణ్నూ , సన్నీ గొడవగా మారింది . ఒకానొక సమయంలో వీరిద్దరూ కొట్టుకుంటారా అనేట్లు వారి చేతలు కనపడ్డాయి . ఆడవాళ్లను అడ్డం పెట్టుకుని ఆట ఆడుతున్నావ్ అన్న సన్నీ కామెంట్ కి షణ్నూ లవర్ దీప్తి సునైనా ఘాటుగా స్పందించి  ఆ వ్యాఖ్యలను తీవ్రంగా కండించింది కూడా . సిరికి సపోర్ట్ గా షన్ను నిల్చుంటే అది ఆడవాళ్లను గేమ్ లో అడ్డుపెట్టుకోవడమా ? అని వాపోయింది . గేమ్ లో కాజల్ నీకు సపోర్ట్ చేసింది కదా అప్పుడు ఏమైంది ? అని సోషల్ మీడియా ముఖంగా ప్రశ్నించింది . యూట్యూబ్ వరకే గుర్తు పెట్టుకో? అని సన్నీ వార్ణింగ్ ఇవ్వడాన్ని ఆమె తప్పు పట్టింది . షణ్నూ ఎంతో కస్టపడి ఈ స్థాయివరకు వచ్చాడని సంతోషించక ఎలా  పడితే ఆలా నోటికొచ్చినట్లు మాట్లాడడం సరి కాదని హితవు పలికింది.
 

 మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ అయినటువంటి శివజ్యోతి కూడా షణ్నూ కి  మద్దతు తెలిపింది . దీప్తి కి ఇంస్టాగ్రామ్ స్టోరీ ని షేర్ చేస్తూ ఆడవాళ్లను అడ్డం పెట్టుకోవడం ఏంటి ? మీరు కెప్టెన్ అవ్వడానికి యానీ ని సపోర్ట్ అడగలేదా ? మరి ఇది లేడీ కార్డు ఉపయోగించడం కదా ? ఒకసారి గుర్తు చేసుకోండి . హౌస్ లో హెల్దీ గేమ్ ఆడమని హితవు పలికింది . మీరు మీ ఫ్రెండ్స్ తో కలసి గేమ్ ఆడొచ్చు , మీ ఫ్రెండ్స్ సేవ్ చేయకపోతే మీరు అలగొచ్చు   ..ఏంటో మరి .. అంటూ సన్నీకి చురకలు అంటించింది .



ఈ వ్యాఖ్యలతో శివజ్యోతి పై సన్నీ అభిమానులు తెగ ట్రోల్ల్స్ మొదలు పెట్టారు . షణ్నూ సిరి క్యారక్టర్ గురించి మాట్లాడొచ్చూ కానీ సిరి సన్నీ క్యారెక్టర్ ని తప్పుగా మాట్లాడడం తప్పులేదు , దీనికి షణ్నూ మద్దతివ్వడం అస్సలు తప్పుకాదు . ఇలాంటి చెత్త పాయింట్స్ పట్టుకుని వేలాడకండి . మీరు జరిగిన సంభాషణల గురించి మాట్లాడాలి అంతే కానీ ఒకరి తరుపున మాత్రమే వకాల్తా పుచ్చుకొని పక్షపాతం చుపిస్తారనుకోలేదు అని కొందరు ఎద్దేవా చేసారు .  బిగ్ బాస్  షోని షోలాగే ఆదరించండి కానీ హౌస్ మెట్  క్యారెక్టర్‌ ని  జడ్జ్‌ చేయొద్దు అని  చెప్పి  వీడియోలు పెట్టిన  మీరే ఇలా క్యారెక్టర్‌ ని  జడ్జ్‌  చేస్తూ నీతులు చెబుతుంటే ఎలా అని ఓ  నెటిజెన్  జ్యోతిని నిలదీశారు. నువ్వు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి గేమ్ ఆడినవా ? ఊరికే ఏడ్వడం తప్ప ? మీరు చేసింది ఏమి లేదు . అలంటి మీరు గేమ్ గురించి మాట్లాడం విచిత్రం గా ఉంది . అంటూ  ఆడియన్స్ ట్రోల్ల్స్ చేస్తున్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: