దర్శకధీరుడు రాజమౌళి అంటే ఇన్నాళ్లూ.. సూపర్‌ మేకర్‌ అనే మాటలే వినిపించేవి. కమర్షియల్‌ హిట్స్‌కి కేరాఫ్‌ అడ్రస్‌ అనే కాంప్లిమెంట్స్‌ వచ్చేవి. అయితే ఇప్పుడు జక్కన్న మంచి స్ట్రాటజిస్ట్‌ అని అంటుంటారు. భారత క్రికెట్‌ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీని మించిన ఇంద్రజాలం చేస్తున్నాడనే స్టేట్ మెంట్స్ వస్తున్నాయి.

ఆర్ఆర్ఆర్ సినిమా అనౌన్స్‌మెంట్‌ వచ్చినప్పటి నుంచి ఫిల్మ్‌ నగర్‌లో బోల్డన్ని చర్చలు జరుగుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ డామినేటింగ్‌గా ఉంటుందా.. రామ్ చరణ్‌ రోల్‌కి ఎక్కువ స్కోప్‌ ఉంటుందా అని చాలా మందికి సందేహాలున్నాయి. కొంతమంది అయితే ఇద్దరి హీరోల్లో ఎవరిని తక్కువ చేసినా అభిమానులు గొడవ చేస్తారనే మాటలు కూడా వినిపించాయి. చిరంజీవి, బాలకృష్ణ స్టార్ రేసులో అడుగుపెట్టినప్పటి నుంచి నందమూరి, కొణిదెల అభిమానుల మధ్య విమర్శలు, గొడవలు జరుగుతూనే ఉన్నాయి. సో 'ట్రిపుల్‌ ఆర్'లో ఇద్దరు హీరోలని మేనేజ్ చేయడంకంటే, వాళ్ల అభిమానులని సంతృప్తి పరచడం కష్టమనే చెప్పాలి. అయితే రాజమౌళి మాత్రం ఈ పరీక్షలో వందకి రెండొందల మార్కులు తెచ్చుకుంటున్నాడని చెప్పొచ్చు.

రామ్‌ చరణ్‌ టీజర్‌ విడుదల చేసినప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌తో వాయిస్‌ చెప్పించాడు. ఇక తారక్‌ టీజర్‌కి చరణ్‌తో వాయిస్‌ ఓవర్ చేయించాడు రాజమౌళి. ఒకరిని చూపిస్తూ, మరొకరిని వినిపిస్తూ ఇద్దరి అభిమానులని సంతృప్తి పరిచాడు జక్కన్న. టీజర్స్‌ నుంచి రెండు కళ్ళ సిద్ధాంతం పాటిస్తోన్న రాజమౌళి 'నాటు' సాంగ్‌ని కూడా ఇలాగే డిజైన్‌ చేయించాడు. ఇద్దరినీ ఈక్వల్‌గా చూపిస్తూ అభిమానులు హర్ట్‌ కాకుండా జాగ్రత్త పడ్డాడు.


జూనియర్ ఎన్టీఆర్ మంచి డ్యాన్సర్ అనే సంగతి అందరికీ తెలుసు. ఆయన డ్యాన్స్ కు అందరూ పరవశించిపోతుంటారు. జూనియర్ ఎన్టీఆర్ స్టెప్స్ కు మైమరిచిపోతారు. ఇక రామ్ చరణ్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తండ్రి నుంచి డ్యాన్స్ ను వారసత్వంగా తెచ్చుకున్న రామ్ చరణ్ డ్యాన్స్ తో మైమరిపిస్తాడు. అయితే ఈ ఇద్దరినీ ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి డ్యాన్స్ లో సరికొత్త ఒరవడిని సృష్టించాడు జక్కన్న.  

 


మరింత సమాచారం తెలుసుకోండి: