సినిమా ఇండస్ట్రీలో ఫేమ్ మరియు క్రేజ్ ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని లేకపోతే తే కెరియర్ నాశనం అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని తెలుస్తుంది.. అయితే ఇందులో వచ్చీరావడంతోనే హిట్లు అందుకొని క్రమక్రమంగా వరుస ఫ్లాపులు బారిన పడడంతో తెరమరుగైన నటీనటులు మరియు దర్శక నిర్మాతలు సినిమా ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారని తెలుస్తుంది.

అయితే కన్నడలో 2004వ సంవత్సరంలో ప్రముఖ స్వర్గీయ నటుడు హీరో పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించిన "వీర కన్నడిగా" అనే చిత్రం ద్వారా దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టిన ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదని అయితే తెలుగులో మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన బిల్లా, కంత్రి మరియు షాడో, తదితర చిత్రాలు బాక్సాఫీసు వద్ద ప్రేక్షకులని ఓ మోస్తరుగా ఆకట్టుకున్నాయని తెలుస్తుంది.

దీంతో అప్పట్లో మెహర్ రమేష్ తో సినిమాలు చేసేందుకు పలు టాలీవుడ్ టాప్ హీరోలు బాగానే ఆసక్తి చూపించారని తెలుస్తుంది కానీ టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తెరకెక్కించిన శక్తి చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిందని దీంతో ఈ ప్రభావం మెహర్ రమేష్ సినిమా కెరియర్ పై పడిందని తెలుస్తుంది.అయితే తాజాగా మెహర్ రమేష్ గురించి ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోందని సమాచారం. ఇంతకీ ఆ వార్త ఏమిటంటే శక్తి చిత్రం తెరకెక్కించడానికంటే ముందుగా మెహర్ రమేష్ టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తో సినిమా తీసేందుకు ఈ కథను సిద్ధం చేసుకుని మహేష్ బాబు కి వినిపించాడని దాంతో కథ నచ్చడంతో మహేష్ బాబు కూడా వెంటనే ఓకే చెప్పాడని తెలుస్తుంది.కానీ శక్తి సినిమా డిజాస్టర్ కావడంతో మహేష్ బాబు మెహర్ రమేష్ తో సినిమా క్యాన్సిల్ చేసుకున్నాడని కొందరు అనుకుంటున్నట్లు సమాచారం.. ఆ తర్వాత మెహర్ రమేష్ మహేష్ బాబు తో తెరకెక్కించాలనుకున్న ఈ కథను మరో టాలీవుడ్ హీరో కి చెప్పినప్పటికీ అతడు కూడా రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది.దీంతో అప్పటినుంచి మెహర్ రమేష్ టాలీవుడ్ లో సినిమాలు తెరకెక్కించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ పెద్దగా వర్క్ అవుట్ కావడం లేదని తెలుస్తుంది.

అయితే సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్న మెహర్ రమేష్ కి బంపర్ ఆఫర్ తగిలిందని సమాచారం. ఈ క్రమంలో అప్పటివరకు సినిమా అవకాశాలు లేని మెహర్ రమేష్ కి ఏకంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా తెరకెక్కించే అవకాశం దక్కిందని తెలుస్తుంది.దీంతో ఇటీవలే చిత్ర యూనిట్ సభ్యులు కూడా ఈ చిత్రానికి భోళా శంకర్ అనే టైటిల్ ని ఖరారు చేశారని అంతేకాకుండా షూటింగ్ పనులు కూడా ప్రారంభించారని మరి మెహర్ రమేష్ భోళా శంకర్ చిత్రంతో ఆకట్టుకుని మళ్లీ తన పూర్వ వైభవాన్ని తిరిగి తెచ్చుకుంటాడో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: