నేషనల్ క్రష్ రష్మిక మందన, నాగ శౌర్య హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ ముద్దు గుమ్మకు టాలీవుడ్ లో క్రేజీ సినిమా ఆఫర్లు కూడా దక్కాయి. అందులో భాగంగా గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, దేవ్ దాసు వంటి పలు చిత్రాలలో నటించిన రష్మిక మందన అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది. ఇలా టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈ హాట్ బ్యూటీ కార్తీ హీరో గా తెరకెక్కిన సుల్తాన్ సినిమాతో తమిళ్ ప్రేక్షకులను పలకరించింది, కాకపోతే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.

ఇలా ఇప్పటికే కన్నడ, తెలుగు, తమిళ్ ప్రేక్షకులను అలరించిన రస్మిక ప్రస్తుతం బాలీవుడ్ లో మిషన్ మజ్ను అనే సినిమాలో నటించింది. ఇది ఇలా ఉంటే రష్మిక మందన బాలీవుడ్ డెబ్యూ సినిమా అయిన మిషన్ మజ్ను విడుదల కోసం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తుంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా హిందీ మీడియాతో మాట్లాడిన రష్మిక మందన పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. బాలీవుడ్ మీడియా రష్మిక మందన ను డేటింగ్- ప్రేమ గురించి ప్రశ్నించింది. తన వయస్సు కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తితో డేటింగ్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని అడిగినప్పుడు. ప్రేమకు వయసు, భాష అడ్డంకులు కావు అని రష్మిక మందన తెలియజేసింది. ఇకపోతే అబ్బాయి ఎలా ఉండకూడదు అనే దాని గురించి రష్మిక మందన మాట్లాడుతూ.. అబ్బాయి అమ్మాయిని మార్చడానికి లేదా ప్రభావితం చేయడానికి ప్రయత్నించకూడదని ఆమె ఎలా ఉంటుందో అలా ఉండనివ్వాలి అని తెలియజేసింది. ఇలా రష్మిక మందన బాలీవుడ్ మీడియాతో పలు విషయాలను చర్చించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: