టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు మహేష్ బాబు. ఇక మహేష్ సినిమా నుంచి ఏదైనా చిన్న అప్డేట్ వచ్చిన గాని అది సోషల్ మీడియాలో రికార్డ్స్ ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల మహేష్ నటిస్తున్న 'సర్కారు వారి పాట' టీజర్ విడుదలై ఆల్ టైమ్ రికార్డ్స్ క్రియేట్ చేసింది. దాని వివరాల్లోకి వెళితే... పరశురామ్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా 'సర్కారు వారి పాట' సినిమా తెరకెక్కుతోంది. 14 రీల్స్, జి ఎం బి క్రియేషన్స్, movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

 ఇక ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా నుంచి ఆగస్టు 9 మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్ట్ అంటూ సర్కారు వారి పాట టీజర్ను విడుదల చేశారు. దీంతో సోషల్ మీడియాలో ఆ టీజర్ దుమ్ముదులిపేసింది. మహేష్ బాబు పుట్టిన రోజున సోషల్ మీడియా మొత్తం ఈ టీజర్ మేనియానే నడిచింది. టీజర్ లో ముఖ్యంగా మహేష్ బాబు లుక్స్, స్టైల్, యాక్షన్ సన్నివేశాలు, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓ రేంజ్ లో ఉండడంతో మహేష్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ ని కూడా ఈ టీజర్ విశేషంగా ఆకట్టుకుంది. దీంతో ఈ టీజర్ సోషల్ మీడియాలో ఆల్ టైం రికార్డ్స్ క్రియేట్ చేసింది. అప్పటి వరకు ఉన్న సినిమాల టీజర్స్ ని దాటేసి సర్కారు వారి పాట టీజర్ సరికొత్త రికార్డ్ను క్రియేట్ చేసింది.

 విడుదలైన కేవలం 24 గంటల్లోనే ఏకంగా 25.7 మిలియన్ల వ్యూస్ ని సాధించి అన్ని రికార్డులను బ్లాస్ట్ చేసేసింది. దీంతో 'అల్ టైం హైయెస్ట్ బిడ్ ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీగా' ఈ సినిమా టీజర్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. అంతే కాదు లైక్స్ పరంగా కూడా సరికొత్త బెంచ్ మార్కును సెట్ చేసింది. సర్కారు వారి పాట టీజర్ కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే 754 k+ లైక్స్ తో దూసుకెళ్లింది. ఇక ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాని ముందుగా సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల సంక్రాంతికి కాకుండా ఏప్రిల్ 1  కి  ఈ సినిమా విడుదల కానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: