టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన భర్త నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత ఫుల్ బిజీగా మారిపోయింది. ఒకపక్క వరుస ప్రాజెక్టులకు గ్రీన్సిగ్నల్ ఇస్తూనే మరోపక్క తన స్నేహితులతో కలిసి ట్రిప్స్ ఎంజాయ్ చేస్తోంది. పెళ్లి తర్వాత సమంత తన సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేసింది. కేవలం సెలెక్టెడ్ కథలను మాత్రమే ఎంపిక చేసుకుని ఆ కథల్లో హద్దులు దాటకుండా ఉండే పాత్రలను మాత్రమే చేసింది. అయితే ఇప్పుడు విడాకులు అవడంతో మళ్లీ తన పాత పద్ధతినే కంటిన్యూ చేయబోతోంది సమంత. పెళ్లి తర్వాత తన అందాల ఆరబోతకు పులిస్టాప్పెట్టిన సమంత ఇకపై నుంచి పూర్తి గ్లామర్ పాత్రలో నటించడానికి ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.

 ఈ నేపథ్యంలోనే ఓ స్టార్ హీరో సినిమాలో తన అందాలను ఆరబోయడానికి ఈ భామ అ రెడీ అయినట్లుగా తెలుస్తోంది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. సమంత ఓ అగ్ర హీరో సినిమాలో ఐటమ్ సాంగ్ లో మెరవ బోతోందట. అగ్ర హీరోయిన్లు అప్పుడప్పుడు ఐటం సాంగ్స్ కూడా చేస్తూ ఉంటారు. తమన్నా, కాజల్ అగర్వాల్, అనుష్క, పూజా హెగ్డే లాంటి హీరోయిన్లు ఇప్పటికే కొన్ని ఐటమ్ సాంగ్స్ లో నటించారు.ఇక ఇప్పుడు సమంతా కూడా అదే చేయబోతోంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న 'పుష్ప' సినిమాలో సమంత ఐటం సాంగ్ చేయబోతుందట.

గతంలో సుకుమార్ డైరెక్ట్ చేసిన రంగస్థలం సినిమాలో హీరోయిన్ గా నటించింది సమంత. అటు అల్లు అర్జున్ కి జోడీగా సన్నాఫ్ సత్యమూర్తి సినిమా లో నటించింది. అయితే ఇప్పుడు తాజాగా వీళ్ళ కాంబినేషన్లో ఐటమ్ సాంగ్ చేయడానికి సమంతా ఓకే చెప్పిందని సమాచారం. ఇక ఈ ఐటమ్ సాంగ్ కోసం ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోలో ఓ భారీ సెట్ కూడా నిర్మించినట్లు తెలుస్తోంది. అంతేకాదు వచ్చే వారం నుండి ఈ సాంగ్ కు సంబంధించిన షూటింగ్ కూడా ఉండబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా విడాకుల తర్వాత సమంత మాత్రం మళ్లీ తన పాత రూట్ లోకి వచ్చేసి వరుస సినిమాలతో అభిమానులను అలరించబోతోంది. ఇక రెండు భాగాలుగా తెరకెక్కుతున్న పుష్ప సినిమా పార్ట్ 1 డిసెంబర్ 17న విడుదల కాబోతోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: