టాలీవుడ్ లో తెలుగు సినిమాలే ఎక్కువ హవా చూపిస్తూ ఉంటాయి. అయితే అప్పుడప్పుడు మాత్రం ఇతర సినిమా ఇండస్ట్రీల నుండి సినిమాలు తెలుగులో రిలీజ్ అయి ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. వాటిలో  కొన్ని  పర్వాలేదనిపించినా ఎక్కువ మాత్రం నెగటివ్ టాక్ తెచ్చుకుని తెలుగు ప్రజలను నిరాశ పరుస్తాయి. అదే విధంగా కన్నడ భాష నుండి 2018 లో కేజీఎఫ్ మూవీ రిలీజ్ అయింది. ఈ సినిమాలో యంగ్ హీరో యశ్ హీరోగా నటించాడు. అప్పటి వరకు యశ్ కు పెద్దగా పేరు లేదు. కానీ ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో అన్ని భాషల్లోనూ రిలీజ్ అయి విడుదలైన అన్ని కేంద్రాలలో విజయవంతంగా ఈ సినిమా ప్రదర్శించబడినది. ఈ సినిమా ఫలితంతో యశ్ పేరు ఒక్కసారిగా దేశమంతా మారుమ్రోగింది.

సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు అంతగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఒక్క సారిగా ఈ సినిమాను థియేటర్ లో చూసిన ప్రేక్షకులు యశ్ నటన, కథ, యాక్షన్, డైరెక్షన్ ఇలా ప్రతి ఒక్క అంశం ఆకట్టుకోవడంతో ఓవర్ నైట్ లో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. యూట్యూబ్ లో ఈ సినిమా ట్రైలర్ 146 మిలియన్ల వ్యూస్ ను దక్కించుకుంది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్ కెరీర్ ఒక్క సారిగా మారిపోయింది. వరుసగా అగ్ర హీరోలు ఇతనికి అవకాశాలు ఇచ్చారు.  ప్రస్తుతం యశ్ తోనే కేజీఎఫ్ చాప్టర్ 2 తెరకెక్కింది.

ఇప్పటికే ఇందులో నుండి విడుదలైన ఫస్ట్ లుక్ మరియు టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.  ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఒక పక్క ప్రభాస్ తో సలార్ మూవీ విడుదలకు సిద్దంగా ఉంది. ఆ తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కానీ ట్రైలర్ నుండి సినిమా వరకు కేజిఎఫ్ ఒక చరిత్ర అని చెప్పాలి. ప్రస్తుతం కేజిఎఫ్ చాప్టర్ 2 కోసం ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: