బాల నటుడి గా తెలుగు తెరకు పరిచయమైన జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత , బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించి ఆ తర్వాత హీరోగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన విషయం అందరికీ తెలిసిందే..ఇకపోతే ఈయన అటు ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా అలరించడమే కాకుండా మాస్ హీరోగా ప్రేక్షకులలో మంచి ఫాలోయింగ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. నందమూరి తారక రామారావు లాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా తనదైన శైలిలో ప్రేక్షకులలో చెరగని ముద్ర వేసుకోడం గమనార్హం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ,హరికృష్ణ రెండవ భార్య శాలిని కి జన్మించిన ఎన్టీఆర్ వల్లే, సీనియర్ ఎన్టీఆర్ హరికృష్ణ రెండవ భార్య ను వారి కుటుంబంలో ఒకరిగా ఆహ్వానించడం జరిగింది.

ఇక అలా హీరోగా ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్ ఎన్నో మాస్ చిత్రాలలో నటించి, ఒక ప్రత్యేకమైన క్రేజ్ను సొంతం చేసుకున్నారు. ఇకపోతే 2017 వ సంవత్సరం లో మొదటి సారి త్రిపాత్రాభినయం చేసి ప్రేక్షకులకు బాగా దగ్గరైన సినిమా జై లవకుశ.. అప్పటివరకు నష్టాల్లో కూరుకుపోయి, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తన అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్ కు ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. రాశిఖన్నా , నివేదా థామస్ హీరోయిన్లుగా నటించగా జూనియర్ ఎన్టీఆర్ మూడు పాత్రలలో నటించి అందరినీ అలరించాడు.

అంతేకాదు హిందీ చలనచిత్ర అలాగే టెలివిజన్ నటుడు అయిన రోనిత్ రాయ్ మొదటిసారి విలన్ గా తెలుగు తెరకు పరిచయం కావడం గమనార్హం.. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇక జై లవ కుశ సినిమాకు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేశారు. ఇక ఈ సినిమా విడుదల అయి బాక్సాఫీసు వద్ద ఏకంగా రూ.130 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: