నాగ శౌర్య, రీతూ వర్మ కలసి జంటగా నటించిన చిత్రం వరుడు కావలెను. ఈ సినిమా అక్టోబర్ 29న బ్రహ్మాండంగా విడుదలైంది. ఇక ఈ సినిమాకి డైరెక్టర్ గా లక్ష్మి సౌజన్య వహించింది. ఈమె మొదటి సారిగా ఈ సినిమాకి దర్శకత్వం వహించింది. ఇక ఈ వరుడు కావలెను సినిమా కొన్ని ఏరియాల్లో సక్సెస్ కాలేదని తెలుస్తోంది. అయితే తాజాగా లక్ష్మీ సౌజన్య ఒక ప్రముఖ ఇంటర్వ్యూ ఛానల్ లో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. వాటి గురించి ఇప్పుడు మనం చూద్దాం.

డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య ఈ విధంగా తెలియజేస్తోంది.. తను 11 ఏళ్ళకే పదవ తరగతి పాస్ అయ్యాను అని చెప్పుకొచ్చింది. ఇక తన తండ్రి కూడా ఎమ్మెస్సీ గోల్డ్ మెడలిస్ట్ అని తెలియజేసింది. లెక్కలు సబ్జెక్టు అంటే తనకి చాలా భయం ఉండేది అని చెప్పుకొచ్చింది లక్ష్మీ సౌజన్య. ఇంటర్మీడియట్ కోసం కాలేజీలో చేరినప్పుడు అబ్బాయిల వెకిలి వేషాలు వేస్తే వారికి చుక్కలు చూపించే దానిని ఆమె తెలిపింది.. ఒక సమయంలో ఒక అబ్బాయి తన సైకిల్ టైర్లలో గాలి తీసేయడం తో లెఫ్ట్ అండ్ రైట్ పీకానని ఆమె తెలిపింది.


దురదృష్టవశాత్తు ఇంటర్ ఫస్టియర్ ఫెయిల్ కావడంతో ఇంటికి వెళ్లి గేదలు కాసుకో అని అందరూ ఎగతాళి చేశారు అని బాధపడింది.. కరెస్పాండెన్స్ లో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత తన దారిని సినిమాలవైపు మార్చుకున్నాను అని ఆమె తెలిపింది. లోకల్ ఛానల్ లో న్యూస్ రీడర్ గా కెరీర్ ని ప్రారంభించిన లక్ష్మి సౌజన్య గోదావరి , ధైర్యం సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిందట.. అయితే ఆ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నప్పుడు ఈమె నాన్న పాంక్రియాస్ క్యాన్సర్ తో  చనిపోతే ఏడవ కూడదని నిశ్చయించుకుని, తన నాన్నకు ఇచ్చిన మాట ప్రకారం ఆమె ఏడవ లేదని వెల్లడించింది..

ఒక కామెడీ హీరో ఆడవాళ్ళ డైరెక్షన్ లో సినిమా చేయానని తనను రిజెక్ట్ చేశాడు అని, అలా శర్వానంద్ హీరోగా తెరకెక్కించిన సినిమా ఆగిపోయింది అని ఆమె తెలిపింది.. అయితే ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు సహాయంతో ప్రముఖ నిర్మాత చిన్నబాబు కు వరుడు కావలెను సినిమా కథ వినిపించానని , మొత్తానికి ఈ సినిమా తెరకెక్కింది అని, కానీ నాన్న నా సక్సెస్ ను  చూడలేక పోయాడు అంటూ ఆమె కన్నీరుమున్నీరైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: