ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ఆర్ఆర్ఆర్ సినిమా రోజు రోజుకు ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ని పెంచుకుంటూ దూసుకుపోతోంది. రౌద్రం రణం రుధిరం పేరుతో పాన్ ఇండియా సినిమాగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర చేస్తుండగా చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్న విషయం తెలిసిందే. డివివి ఎంటెర్టైన్మెట్స్ బ్యానర్ పై ఎంతో హై బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ కి కీరవాణి సంగీతాన్ని, రమా రాజమౌళి స్టైలింగ్ ని అలానే కేకే సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫిని అందిస్తుండగా ఒలీవియా మోరిస్, అలియా భట్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల రెడీ అవుతున్న విషయం తెలిసిందే. భారీ పేట్రియాటిక్ డ్రామా మూవీగా యాక్షన్, కమర్షియల్ హంగులతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోలిద్దరి ఇంట్రడక్షన్ సీన్స్ తో పాటు ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పులితో పోరాడే సన్నివేశం,
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పోలీస్ స్టేషన్ సీన్, అలానే ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ ఎపిసోడ్, సెకండ్ హాఫ్ లో భారీ యాక్షన్ సీన్స్ తో పాటు క్లైమాక్స్, క్లైమాక్స్ వంటి సీన్స్ సినిమాకి ఎంతో కీలకమని టాలీవుడ్ వర్గాల టాక్.

ఇక ఈ సినిమాని ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా భారీ స్థాయిలో దానయ్య ఖర్చు పెడితే, రేవు థియేటర్స్ లో ఆడియన్స్ కి థ్రిల్ కలిగించి ఆకట్టుకునే రీతిలో మూవీ ని రాజమౌళి ఎంతో అత్యద్భుతంగా తెరకెక్కించారని అంటున్నారు. మొత్తంగా అందరిలో విపరీతమైన అంచనాలు ఏర్పరిచిన ఆర్ఆర్ఆర్ మూవీ, రేపు విడుదల తరువాత అనేక భాషల్లో సరికొత్త రికార్డులను కొల్లగొట్టడంతో పాటు ఎన్టీఆర్, చరణ్ ఇద్దరికీ కూడా భారీ స్థాయి క్రేజ్ తెచ్చిపెట్టడం ఖాయం అని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: