సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో గా కొనసాగాలి అంటే ఎవరైనా సరే తమ సినిమాల ద్వారా మంచి విజయాన్ని అందుకోవాలి. ఇప్పట్లో స్టార్ హీరోల హవా కొనసాగుతున్న సమయంలో యంగ్ హీరోలు నిలబడాలి అంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది.. ఈ తరుణంలోనే ఇప్పుడు ఒక యంగ్ హీరో కచ్చితంగా హిట్ కావాలి అని అంటున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే, తన కెరియర్ మొదట్లో మంచి మంచి సినిమా కథలను ఎంచుకుని తన ప్రతిభతో మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో రాజ్ తరుణ్.. ఈయన మాత్రం తనకు వచ్చిన క్రేజ్ ను సరిగా వాడుకోలేదు అని తెలుస్తోంది.. ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ లాంటి డైరెక్షన్లో సినిమా చేసినా కూడా ఇతని కెరియర్ డైలమాలో పడ్డదని చెప్పాలి.వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ ఈయనకు ఒక్కటి కూడా సరైన హిట్ రావట్లేదు.  ఇక లేటెస్ట్ గా రాజ్ తరుణ్ కు  మొదటి చాన్స్ ఇచ్చిన అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో నే  సరికొత్తగా అనుభవించు రాజా అనే సినిమాను చేస్తున్నాడు.. ఈ సినిమాను శ్రీను గవిరెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. ఇకపోతే ఈ నెల 26వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని టీమ్ మెంబర్స్ సన్నాహాలు సిద్ధం చేసుకుంటున్నారు.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్ కూడా మంచిగా సినిమాపై బజ్ ఏర్పడేలా చేశాయి..ఇప్పుడు రాజ్ తరుణ్ తప్పకుండా హిట్ కొట్టాల్సిందే.. ఎందుకంటే ఇప్పటివరకు ఈయన చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు అయితే అందుకోలేదు. ఇక నాగార్జున బ్యానర్లో సినిమా వచ్చింది కాబట్టి మినిమమ్ హిట్ కొడుతుందని అంచనాలు ఉన్నాయి.. అందుకే రాజ్ తరుణ్ కూడా ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు..అయితే ఈసారైనా ఈ సినిమాతో ఈయన హిట్ కొట్టి ట్రాక్లోకి వస్తాడో లేదో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: