మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమా లతో ఫుల్ బిజీ గా ఉన్నాడు, ఇప్పటికే రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఖిలాడి సినిమా షూటింగ్ ను దాదాపుగా పూర్తి చేసుకున్న రవితేజ ఈ సినిమాను ఫిబ్రవరి 11 వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సినిమా లో డింపుల్ హయాతి మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఈ సినిమా తో పాటు రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' అనే సినిమా లో కూడా రవితేజ హీరోగా నటిస్తున్నాడు, ఈ సినిమా లో రవితేజ ఒక పవర్ఫుల్ ఎమ్మార్వో క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాతో పాటు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ధమాకా అనే ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ సినిమాలో కూడా రవితేజ నటిస్తున్నాడు. ఈ మూడు సినిమా లతో ఫుల్ బిజీగా ఉన్న రవితేజ టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాలో కూడా నటించడానికి రెడీగా ఉన్నాడు.

ఇలా వరుస సినిమా లను లైన్ లో పెట్టుకొని ఫుల్ బిజీగా ఉన్నా మాస్ మహారాజ రవితేజ సుధీర్ వర్మ దర్శకత్వం లో రావణాసుర అనే సినిమాలో కూడా నటించబోతున్నాడు. అయితే ఈ సినిమా కోసం రవితేజ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది, ఈ సినిమాలో రవితేజ లాయర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఆ పాత్ర కోసం రవితేజ ప్రత్యేకంగా హోంవర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అసలు లాయర్ ల బిహేవియర్ ఉంటుంది, కేసు సమయంలో ఎలా వాదిస్తారు, లాయర్ల బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది. ఇలా అనేక విషయాలపై రవితేజ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది. లాయర్ల గురించి అనేక విషయాలను ప్రత్యేకంగా ఇద్దరు లాయర్ల దగ్గర నుంచి రవితేజ తెలుసుకుంటునడట. కోర్టు వాదనలకు సంబంధించిన కొన్ని సెక్షన్ లను కూడా రవితేజ తెలుసుకున్నాడట. ఇలా రవితేజ రావణాసుర సినిమా కోసం తెగ కష్టపడుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: