టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ప్రస్తుతం నెంబర్ వన్ హీరోగా సంగీత దర్శకుడిగా ఓ వెలుగు వెలుగుతున్న తమన్ ఆయన చేతిలో ఇప్పుడు ఏకంగా 13 సినిమాలు ఉన్నాయి అంటే ఆయన స్టార్ డం ఏ రేంజ్ లో కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు. అల వైకుంఠపురం లో సినిమా తో ఒక్కసారిగా తన క్రేజ్ ను భారీగా పెంచుకున్న తమన్ అంతకు ముందు ఎన్ని విమర్శలు వచ్చినా కూడా ఆ సినిమా నుంచి వెరైటీ సంగీతాన్ని అందిస్తూ ఇప్పటివరకు మంచి సినిమాలు చేసుకుంటూ భారీ స్థాయిలో గుర్తింపు తగ్గించుకుంటూ వెళుతున్నాడు.

2020 వ సంవత్సరంలో దాదాపు పది పెద్ద సినిమాలకు పైగానే ఆయన సంగీతం అందించారు. అందులో అన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. 2021 సంవత్సరం కూడా ఆయనకు బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు. ఏకంగా 15 సినిమాలకు ఆయన సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే 2022 వ సంవత్సరం కూడా మొత్తం తమన్ చేతుల్లోనే ఉందని చెప్పవచ్చు. ఆయన ఏకంగా 13 సినిమాలను చేస్తుండడం విశేషం.

మహేష్ హీరోగా నటించిన సర్కారు వారి పాట పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భీమ్లా నాయక్ అలాగే బాలకృష్ణ గోపీచంద్ మలినేని శ్రుతిహాసన్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాకి ఆయనే సంగీతం సమకూరుస్తున్నాడు. ఇప్పుడు వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న గని సినిమాకి కూడా ఆయనే సంగీతం అందిస్తున్నాడు. అక్కినేని అఖిల్ ఏజెంట్ సినిమా అలాగే హీరోగా నటిస్తున్న ఓ మలయాళం సినిమా శంకర్ మరియు రామ్ చరణ్ కలయికలో రాబోతున్న భారీ చిత్రానికి ఆయన సంగీతం సమకూరుస్తున్నాడు. ఇక చిన్న సినిమాలకు కూడా ఆయన సంగీతం అందిస్తుండటం విశేషం. కొరటాల శివ మరియు ఎన్టీఆర్ సినిమాలకు అలాగే మరికొన్ని ఇతర భాషల సినిమాల్లో కూడా ఆయన సంగీతం అందిస్తూ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: