త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్ లో ఈయనకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. 1999లో వేణు హీరోగా నటించిన "స్వయంవరం" అనే సినిమాతో డైలాగ్ రైటర్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన.. ఆ తరువాత ఎన్నో సినిమాలకి రైటర్ గా వర్క్ చేసారు. సుమారు మూడు సంవత్సరాల పాటు రైటర్ గా పని చేసిన ఈయన.. 2002లో తరుణ్ తో " నువ్వే నువ్వే"అనే సినిమాను తెరకెక్కించి డైరెక్టర్ గా మారాడు. ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. అప్పట్లో ఈ సినిమా ఓ సంచలనంగా మారింది. ఇప్పటికి ఈ సినిమా టీవీలో వస్తే చూసి కడుపుబ్బ నవ్వుకునే జనం ఉన్నారు. అంత బాగా రీచ్ అయ్యింది జనాలకు ఈ సినిమా.

ఇక ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో బడా స్టార్స్ కూడా ఈయనతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపారు.  ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు త్రివిక్రమ్ తన కెరీర్ లో  వెనక్కు తిరిగి చూసుకోకుండా 20 ఏళ్లు సక్సెస్ ఫుల్ గా తన సినీ కెరీర్ ను  కొనసాగిస్తున్నారు. ఆయన 20 ఏళ్ళ సినీ కెరీర్ లో దాదాపు 11 సినిమాలను తెరకెక్కించగా..అన్ని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం గమనార్హం. ఇక  దీనిని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఆయన రేంజ్ ఎలా ఉందో .. అభిమానులకు  ఆయన సినిమాలు అంటే  ఎంత ఇష్టమో.

కాసేపు త్రివిక్రమ్ సినిమాల సంగతులు పక్కన పెడితే.. ఆయన పర్సనల్  విషయాల గురించి కొన్ని మాట్లాడుకుందాం. త్రివిక్రమ్ పెళ్లికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్  వార్త నెట్టింట వైరల్ గా మారింది. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ భార్య పేరు సౌజన్య.. సౌజన్య శ్రీనివాస్ ఓ  క్లాసికల్ డాన్సర్. ఆమెకు క్లాసికల్ డాన్సర్ గా మంచి పేరుంది. సౌజన్య స్వయానా సిరి వెన్నెల సీతారామశాస్త్రికి మేనకోడలు అన్న విషయం చాలా మందికి తెలియదు.అయితే త్రివిక్రమ్ పెళ్లి చూపులకి వెళ్లింది సౌజన్య వాళ్ల అక్కను పెళ్లి చేసుకోవడానికి.. కానీ, త్రివిక్రమ్ కు సౌజన్య బాగా నచ్చేసిందట. ఇదే విషయాన్ని వాళ్ల తల్లిదండ్రులకు చెప్పారట. దీంతో వాళ్లు షాక్ అయ్యారట. కానీ అబ్బాయి మంచివాడు మన అమ్మాయి హ్యాపీగా ఉంటుందని ఒకే చెప్పారట. కానీ కండీషన్ ఓ పెట్టారట.  అక్కకు పెళ్లి చేసాకనే చెల్లికి చేస్తాం అని..అప్పటి వరకు మీరు ఆగాలని చెప్పారట. దీంతో వన్ ఇయర్  పాటు వెయిట్ చేసి మరీ సౌజన్యను పెళ్లి చేసుకున్నాడట త్రివిక్రమ్. త్రివిక్రమ్ - సౌజన్య దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: