బుల్లితెర తెలుగు బిగ్ బాస్  సీజన్ 5  లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న జెస్సీ కొన్ని వారాల తరువాత అనారోగ్యం బారిన పడ్డ సంగతి తెలిసిందే. దీంతో జెస్సీ ని ఇంటి నుంచి బయటికి పంపిస్తున్నట్టు బిగ్ బాస్ ప్రకటించి సీక్రెట్ రూమ్ కి పంపించాడు. ఇక వారంరోజుల పాటు సీక్రెట్ రూమ్ కి పరిమితమైన జెస్సీని డాక్టర్స్ ట్రీట్మెంట్ అందించారు. అంతే కాదు కొన్ని ఆరోగ్య పరిస్థితి పరీక్షలకోసం అతన్ని బయటకు కూడా తీసుకెళ్లడం జరిగింది. అయినా కూడా జెస్సీ ఆరోగ్యం మెరుగుపడలేదు. దీంతో ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు పంపించేశాడు. నిజానికి ఈ పదవ వారంలో ఎలిమినేషన్ లో భాగంగా కాజల్ మనస్ లలో ఒకరు హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వాల్సి ఉండగా..

 వారిద్దరినీ సేవ్ చేసి జెస్సీ నీ హౌస్ నుండి బయటకి పంపించేశారు. ఇక జెస్సీ మొత్తం పది వారాలు హౌస్ లో ఉన్నాడు. ఇక ఈ 10 వారాలకు గానూ జెస్సీకి రెమ్యూనరేషన్ రూపంలో భారీగానే అందినట్లు తెలుస్తోంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం వారానికి 1.5 లక్షల ఒప్పందంపై జెస్సి హౌస్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే 10 వారాల కు గానూ జెస్సీ 15 లక్షల వరకు తీసుకున్నాడని సమాచారం. ఇక హౌస్ లో షణ్ముఖ్, సిరి ఇద్దరికీ బెస్ట్ ఫ్రెండ్ గా నిలిచాడు జెస్సీ. తాను హౌస్ నుండి బయటకు వచ్చేటప్పుడు వాళ్ళిద్దరికీ మంచి టిప్స్ కూడా చెప్పి రావడం జరిగింది. మరోవైపు జెస్సీ హెల్త్ కండిషన్ మొత్తం బిగ్ బాస్ గేమ్ అనే మాట కూడా వినిపిస్తోంది.

 ఈవారం హౌస్ నుండి బయటకు పంపించారని అనుకున్న బిగ్ బాస్ ఇలా నాటకం ఆడారని కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే హౌస్ నుండి బయటకు వచ్చిన జెస్సీ ఇప్పుడు చాలా ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నాడు. ఇక హౌస్ నుండి బయటకు రాగానే జెస్సీని బిగ్ బాస్ సీజన్ కంటెస్టెంట్స్ అయినా అలీ రెజా, రాహుల్ లతోపాటు ఈ సీజన్ కంటెస్టెంట్ అయిన శ్వేతా వర్మ  కూడా అతడికి గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. ఇక ప్రస్తుతం జెస్సీ వరుస పార్టీలతో పాటు పలు ఇంటర్వ్యూలలో కూడా పాల్గొంటున్నాడు. మరోవైపు బిగ్ బాస్ ఓటింగ్, ఎలిమినేషన్స్ పై ఆడియన్స్ కి చాలాకాలంగా అనుమానాలున్నాయి. ఓటింగ్ ఆధారంగా కాకుండా వేరే విధంగా ఎలిమినేషన్స్ జరుగుతున్నాయని కొందరు భావిస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: