ద‌క్షిణాది లేడి సూప‌ర్‌స్టార్ ఎవరు అంటే తడుముకోకుండా అందరు టక్కున చెప్పే పేరు ర‌మ్య‌కృష్ణ. అందుకు ఆమె అర్హురాలు. ఇక ఈమె గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఎలాంటి పాత్ర అయినా అవలీలగా చేసే రమ్యకృష్ణ..1990 లలో యువత మనసులు గెలిచి ఎన్నో బ్లాక్ బస్టర్  సినిమాలో హీరోయిన్ గా నటించింది. సినీ ఇండస్ట్రీకి ఎంటర్ అయిన అనతికాలంలోనే టాప్ హీరోయిన్ గా మారి.. తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లోని పలువురు స్టార్ హీరోలతో జోడి కట్టి తిరుగులేని విజయం అందుకుంది. తన అందచందాలతో అన్ని వయసుల వారిని ఉర్రూతలూగించిన రమ్య కృష్ణ .. కెరియర్ లో టఫ్ క్యారక్టర్ లు కూడా తెర పై అవలీలగా పండించేసేది. దాదాపు సినీ ఇండస్ట్రీలో మూడు దశబ్ధలకు పైగా రాణిస్తున్న రమ్యకృష్ణ ఇప్పటికే  ఎన్నో గుర్తుండిపోయే పాత్రల్లో నటించింది. నీలాంబ‌రి గా, శివ‌గామిగా ఇలా కొన్ని పాత్ర‌లు చూస్తే ఇవి ఆమె కోస‌మే పుట్టాయి ఏమో అన్నట్లు అనిపిస్తుంది.

బాహుబ‌లిలో శివ‌గామిగా ప్రభాస్ తల్లిగా నటించి  ఇంట‌ర్నేష‌న‌ల్ వైడ్‌గా పాపుల‌ర్ అయ్యింది ర‌మ్య‌కృష్ణ‌.  ఫ్యామిలీ ఓరియంటెడ్‌, లేడీ ఓరియంటెడ్ ఏ సినిమా అయినా ర‌మ్య‌కృష్ణ న‌ట‌న‌కు తిరుగు లేదని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ర‌మ్య‌కృష్ణ అందం ఇప్పటికి చెక్కు చెదరకుండా అలాగే  మెయిన్ టైన్ చేస్తూ  కుర్ర హీరోయిన్ లకు సైతం గట్టి కాంపీటీషన్ ఇస్తుంది. రమ్యకృష్ణ తన నట జీవితంలో ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించారు.. కానీ, ఆమె సినిమా కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా ఒక్కే ఒక్కటి. అదే కోలీవుడ్ సూపర్ స్టార్ హీరోగా నటించిన "నరసింహా ". ఇప్పటికి ఈ సినిమా టీవీలో వస్తే ప్రజలు అత్తుకుపోయి సినిమా చూస్తుంటారు.

నరసింహ సినిమాలో రమ్య కృష్ణ చేసిన నీలాంబరి పాత్ర మరోకరు చేసుంటే ఖచ్చితంగా సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యేది కాదు.ఇది వాస్తవం. ఈ సినిమాలో రజనీకాంత్ తో పోటీపడి మరీ నటించింది రమ్య అని సినిమా చూసిన ప్రతి ఒక్కరికి అర్ధమైపోతుంది. రజనీకాంత్ లాంటి స్టార్ హీరో పక్కన హీరోయిన్ గా కాకుండా ఓ లేడీ విలన్ గా అహంకారపు అమ్మాయిగా  రమ్య చేసిన నటనకు రజినీకాంత్ సైతం మెచ్చి ఆమెను పొగిడేసారు. అప్పట్లో హీరోయిన్ గా మంచి ఫాంలో ఉన్నా కూడా నెగెటివ్ రోల్ చేసి.. స్టార్ హీరోలకు సైతం తన నటనతో చమటలు పట్టించింది రమ్య. అయితే ఈ సినిమా విడుదల అయిన ఫస్ట్ డే తన సిస్టర్ సినిమా చూడటానికి  థియేటర్ కు వెళ్లితే.. అక్కడ జరిగిన ఓ సంఘటన చూసి ఆమె షాక్ అయ్యిందట. వెంటనే ఇంటికి వచ్చి ఆ విషయాని రమ్యకు చెప్పిందట. ఇంతకు ఏం జరిగిందంటే.. సినిమా చూడటానికి వచ్చిన జనాలు తెర పై రమ్య  కనిపించగానే చెప్పులు విసిరారట. ఆ విషయం వాళ్ళ సిస్టర్ తనతో చెప్పినప్పుడు చాలా బాధ పడిందట రమ్యకృష్ణ. ఆ తర్వాత తన పాత్రకు మంచి పేరు రావడంతో అవన్నీ మర్చిపోయిన్నట్లు చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: