తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎవర్ గ్రీన్ నటుడు ఎవరు అంటే అందరు చెప్పే ఒక్కే ఒక్క పేరు సోగ్గాడు శోభన్ బాబు. ఆయన మరణించి కొన్ని సంవత్సరాలు కావస్తున్న ఇప్పటికీ ఈయనంటే పడి చచ్చిపోయే అభిమానులున్నారు అనడంలో సందేహం లేదు. మరీ ముఖ్యంగా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఈయనకు ఉన్నంతగా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్టార్ హీరోకి లేదు. ఎన్నో సినిమాలో హీరోగా నటించిన ఈయన.. సినీ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమాలు కొన్ని ఉన్నాయి. అవే ధర్మ పీఠం దద్దరిల్లింది, చెల్లెలికాపురం , మనుషులు మారాలి వంటి సినిమాలు. ఈ సినిమాలు ఆయన ఇమేజ్ ను మరింత పెంచాయి అనే చెప్పాలి. ఇక ఈ సినిమాలలో ఆయన నటనకు ఫిలింఫేర్ , నంది అవార్డులు కూడా లభించడం చెప్పుకొ తగ్గ విషయం. అప్పట్లో ఈయన సినిమాలు వస్తున్నాయంటే బడా హీరోలు సైతం తమ సినిమాలను పోస్ట్ పోన్ చేసుకునే వారు. అంతేందుకు.. ఇప్పటికి శోభన్ బాబు సినిమాలు టీవీలో వస్తే అతుక్కుపోయే ఆడవాళ్లు ఎంతోమంది ఉంటారు. అంతటి క్రేజ్ ఉంది ఈయనకు.

కాగా ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో శోభన్ బాబు గురించి టాపిక్ వచ్చినపుడు ఆశ్చర్యపోయే నిజాలు చెప్పాడు రాశి మూవీస్ నిర్మాత నరసింహారావు. ఆయన మాట్లాడుతూ .."శోభన్ బాబు తో నాకు మంచి సాన్నిహిత్యం ఉంది. మేము ఇద్దరము పర్సనల్ విషయాలను కూడా చర్చించుకునే వాళ్ళం. అంత క్లోజ్ మేము. శోభన్ బాబుతో నేను  పున్నమి చంద్రుడు అనే సినిమాను చేస్తున్న సమయంలో..ఆయన భారీ పారితోషం తీసునేవారు. అప్పుడు నేను ఓ ల్యాండ్ అమ్మేసి  శోభన్ బాబుకు పారితోషకం  ఇవ్వడానికి వెళ్తే .. ఆయన అన్న మాటలు నాకు ఇప్పటికి గుర్తున్నాయి. శోభన్ బాబు స్థలం అమ్మి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని సూచించారు. అంతేకాదు ఆ స్థలాన్ని కూడా మళ్ళీ  నా కూతురు పేరు పైనే రాసిచ్చిన  గొప్ప మహానుభావుడు" అని చెప్పుకోచ్చాడు.

అంతేకాదు శోభన్ బాబు మరణించే కొన్ని గంటల ముందు కూడా ఆయనతో మాట్లారట. చివరి క్షణాలలో ఆయన మాట్లాడిన మాటలను అభిమానులకు చెప్పుతూ..." చనిపోయే 25 నిమిషాల ముందు నాతో ఆయన మాట్లాడారు. ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తలు చెప్పారు.  ఆరోగ్యం కంటే మనకు విలువ అయినది మరేదిలేదు అని చెప్పుతూ..ఆరోగ్యం ఉంటేనే ఏదైనా చేయగలం అని ఆయన చెప్పారట . ఇంకా మాట్లాడుతూ ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోమని చెప్పిన కొన్ని నిమిషాలకే గుండెపోటుతో మరణించారు శోభన్ బాబు అని చెప్పుకొచ్చారు. ఒక్కసారిగా నేను షాక్ కి గురి అయ్యాను. ఆయన లేని లోటు ఎవ్వరు తీర్చలేరు. అంత మంచి వ్యక్తి లేని లోటు ఇప్పటికీ సినీ ఇండస్ట్రీలో లోటుగానే మిగిలిపోయిందని" చెప్పుకొచ్చారు నిర్మాత నరసింహారావు.

మరింత సమాచారం తెలుసుకోండి: