పుష్ప సినిమా నుంచి సర్ ప్రైజులు అస్సలు ఆగడం లేదని తెలుస్తుంది.ఒకదాని వెంట మరోటి వస్తూనే ఉన్నాయని సమాచారం.రోజూ ఏదో ఓ ప్రత్యేకం ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారట చిత్ర యూనిట్

ప్రమోషన్ కూడా అలాగే జరుగుతుందని తెలుస్తుంది.రిలీజ్‌కు మరో నెల రోజులు మాత్రమే ఉండటంతో తగ్గేదే లే అంటున్నారట పుష్ప యూనిట్. తాజాగా మరో సాంగ్ ప్రోమో వచ్చేసిందని తెలుస్తుంది.అల వైకుఠపురంలో లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప అని అందరికి తెలుసు.

ఆర్య మరియు ఆర్య 2 సినిమాల తర్వాత హ్యాట్రిక్ చిత్రంగా పుష్ప సినిమా వస్తుందని సమాచారం.. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారట సుకుమార్. ఇందులో మొదటి భాగం పుష్ప: ది రైజ్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల కానుందని తెలుస్తుంది.వరుస బ్లాక్‌బస్టర్ చిత్రాలతో పవర్ ప్యాక్డ్ ప్రొడక్షన్ హౌజ్‌గా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్, మరో నిర్మాణ సంస్ధ ముత్తంశెట్టి మీడియాతో కలిసి నిర్మిస్తున్నారని తెలుస్తుంది.. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రతీ అప్‌డేట్ కూడా సోషల్ మీడియాలో సంచలనం రేపిందని తెలుస్తుంది.ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మరియు టీజర్, దాక్కో దాక్కో మేక, రష్మిక మందన శ్రీవల్లి, సామి సామి పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చిందని తెలుస్తుంది..

తాజాగా ఈ సినిమా నుంచి ‘ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా’ అంటూ సాగే నాలుగో సింగిల్‌కు సంబంధించిన ప్రోమో విడుదలైందని తెలుస్తుంది.నవంబర్ 19 ఉదయం 11.07 నిమిషాలకు పూర్తి పాట విడుదల కానుందని సమాచారం.దీనికి సంబంధించిన అధికారిక పోస్టర్ విడుదలైందని తెలుస్తుంది.అందులో అల్లు అర్జున్ లుక్ అదిరిపోయిందని తెలుస్తుంది మరోసారి తనదైన స్టెప్పులతో పిచ్చెక్కిస్తున్నాడట ఐకాన్ స్టార్. సోషల్ మీడియాలో ఈ ప్రోమోకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుందని తెలుస్తుంది.. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా జాతీయ అవార్డు గ్రహిత మరియు మళయాలీ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారని తెలుస్తుంది.. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారట చిత్రయూనిట్.

మరింత సమాచారం తెలుసుకోండి: