గుజరాతీ బామ మోనాల్ గజ్జర్ తెలుగులో పలు సినిమాలు చేసినా కూడా రాని గుర్తింపు బిగ్ బాస్ షోకి వచ్చాక తెగ ఫేమస్ అయిపోయింది. మొదట అభిజిత్ తో సన్నిహితంగా కనిపించిన ఈ అందాల తార ఆ తరవాత అఖిల్ తో ఎక్కువ కనిపిస్తూ సందడి చేసింది. ఒకరకంగా చెప్పాలంటే సీజన్ 4 లో ఎక్కువగా అభిజిత్, మోనాల్ గజ్జర్, ఇంకా అఖిల్ మీదనే ఎక్కువ ప్రచారం జరిగింది. వీరి ట్రయాంగిల్ లవ్ స్టోరీ కనబరుస్తూ బాగా పాపులర్ అయ్యారు. గేమ్ లో ఎవరికి వారు బాగా పార్టిసిపేట్ చేస్తూ హైలెట్ అయ్యారు. అయితే హౌజ్ నుండి బయటకు వచ్చిన మోనాల్ కు వరుస ఆఫర్లు వరించాయి. పలు షోలతో పాటుగా సినిమాల్లోనూ అవకాశం లభించింది.

అంతేకాదు ఇటీవలే హైదరాబాద్ లో సొంత ఇల్లు కొనుగోలు చేసి హైదరాబాదీ అయ్యింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం మోనాల్ గజ్జర్ కు అదిరిపోయే ఆఫర్ వచ్చినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ఈ భామకు బాలీవుడ్ నుండి క్రేజీ ఆఫర్ ఒకటి లభించినట్లు తెలుస్తోంది. ఓ బాలీవుడ్ యంగ్ హీరో చిత్రంలో ఈ అమ్మడికి సెకండ్ హీరోయిన్ గా నటించే ఛాన్స్ దొరికినట్లు వార్తలు జోరుగా వినపడుతున్నాయి. టాలీవుడ్ లో సెటిల్ అవుదామని అనుకున్న ఈ అందాల భామకు బాలీవుడ్ నుండి పిలుపు రావడంతో ఉక్కిరిబిక్కిరి అవుతోందట. భాష ఏదైనా స్టార్ హీరోయిన్ గా ఎదగాలన్న లక్ష్యంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారట మోనాల్. ఎలాగో హిందీ బాష కూడా ప్రాబ్లమ్ లేదు కాబట్టి క్లిక్ అవుతుందని ఆమె భావిస్తున్నట్లు చెబుతున్నారు.

మరి ఈ వార్త ఎంత వరకు నిజం అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఈ వార్త విన్న మోనాల్ ఫ్యాన్స్ మాత్రం కాస్త సంతోషం కాస్త బాదను కనబరుస్తున్నారు. బాలీవుడ్ నుండి ఆఫర్ రావడం మంచిదే. కానీ టాలీవుడ్ కు కొద్ది రోజులైనా దూరం అవుతారు అన్న ఫీలింగ్ తో  ఆమె  ఫ్యాన్స్ బాధపడుతున్నారు. కానీ తమ అభిమాన తార అనుకున్న స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నారు...

మరింత సమాచారం తెలుసుకోండి: