అక్కినేని నాగార్జున కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ సినిమా సోగ్గాడే చిన్ని నాయన చిత్రం. ఈ సినిమా ఆయనను గట్టెక్కించిన సినిమా అని చెప్పవచ్చు. అప్పటిదాకా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న నాగార్జునకు ఈ సినిమా హిట్ ఎంతో ఊరట ఇచ్చింది. ఈ చిత్రంలో ఆయన ద్విపాత్రాభినయం లో నటించగా కళ్యాణ్ కృష్ణ అనే నూతన దర్శకుడు ఈ చిత్రంతో పరిచయం అవడం విశేషం. అక్కినేని నాగేశ్వరరావు నటించిన హిట్ పాట సోగ్గాడే చిన్నినాయన ను ఈ సినిమా టైటిల్ గానే కాకుండా రీమిక్స్ ను కూడా ఇందులో పెట్టి ఈ సినిమాపై ఎంతో ఆసక్తి కలిగేలా చేశారు.

అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి మరియు రమ్యకృష్ణ హీరోయిన్స్ గా నటించారు. స్టోరీ లైన్ కూడా చాలా బాగా ఉండటంతో స్క్రీన్ ప్లే మరియు మాటలు కూడా ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉండటంతో ఈ సినిమాను ఇంత పెద్ద హిట్ చేశారు ప్రేక్షకులు. కొన్ని లాజిక్ కు అందని అంశాలు కూడా ఈ చిత్రం లో ఉన్న కథ ముందు అవి చిన్న పోవడంతో ప్రేక్షకులు వాటిని ఏ మాత్రం పట్టించుకోలేదు. దాంతో ఈ సినిమాకు ప్రేక్షకులు కనెక్ట్ అయ్యి ఈ సినిమాకు ఇంత పెద్ద విజయం అందించారు. 

2016 లో ఈ సినిమా విడుదల కాగా అక్కినేని కాంపౌండ్ లో ఎంతో సంతోషాన్ని మరెంతో ఆనందాన్ని నింపిన సినిమాగా నిలిచింది అని చెప్పవచ్చు. నాగార్జున నటుడిగా తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం లేకపోయినా ఆయనను సరికొత్త కోణంలో చూపించిన సినిమా ఇది. ఆ విధంగా నాగార్జున కు సరైన టైంలో హిట్ తీసుకు వచ్చి సోగ్గాడే చిన్ని నాయన సినిమా ఆయనకు స్పెషల్ గా నిలవడం లో చాలా కృషి చేసింది. ఇక అనూప్ రూబెన్స్ సంగీతం విషయంలో చాలా కష్ట పడ్డాడు అని చెప్పొచ్చు.  ముఖ్యంగా టైటిల్ సాంగ్ విషయంలో ఆయన తీసుకున్న జాగ్రత్త ఈ సినిమాకే ఈ పాట హైలెట్ అయ్యేలా చేసింది. ఈ పాటలో ముగ్గురు అందాల భామలు నటించగా అది సూపర్ హిట్ అవడం సినిమా విజయానికి దోహదపడింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: