నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఒక్కమగాడు సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేసిన ఈ సినిమాకు వైవియస్ చౌదరి దర్శకత్వం వహించగా ఆయనే ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. 2008లో విడుదలైన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా ఆ అంచనాలను అందుకునే విధంగా ఈ సినిమా లేకపోవడంతో ఒక్కసారిగా బాలకృష్ణకు భారీ పరాజయాన్ని మిగిల్చింది అని చెప్పొచ్చు. అంతకు ముందు నరసింహ నాయుడు, సమరసింహా రెడ్డి వంటి సూపర్ హిట్స్ అందుకున్న బాలకృష్ణసినిమా ల తరహా లోనే ఈ సినిమా కి మంచి విజయాన్ని అందుకుంటాడని భావించగా ఆ సినిమా దారుణంగా పరాజయం అయ్యింది. 

ఈ సినిమాలో అన్ని అస్పెక్ట్స్ పట్టించుకున్న విధంగా కథ విషయంలో పట్టించుకోకపోవడంతో నే ఈ సినిమా ఇంత పెద్ద పరాజయం పాలయింది అని అందరూ అన్నారు. ముఖ్యంగా ఈ సినిమా నరసింహ నాయుడు మరియు భారతీయుడు అనే రెండు సినిమాల హీరోల పాత్రల కలగలుపుగా ఉండడంతో ఈ సినిమాను ప్రేక్షకులు ఫ్లాప్ గా నిర్ధారించారు. ఇక ఈ సినిమాకు సంగీతం అందించిన మణిశర్మ ఈ చిత్రాన్ని ఆల్బమ్ హిట్ చేయడంలో చాలా కృషి చేశారని చెప్పవచ్చు. 

అప్పటికే తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ సంగీత దర్శకుడిగా దూసుకుపోతున్న మణిశర్మ ఈ సినిమాలోని అన్ని పాటలనూ అద్భుతంగా అందించి ప్రేక్షకులను మరొకసారి తన సంగీతంతో అలరించారు. ముఖ్యంగా ఈ సినిమా టైటిల్ సాంగ్ విషయంలో ఆయన ప్రత్యేక జాగ్రత్త తీసుకుని మరీ సంగీతం సమకూర్చారు అని ఆ పాటను బట్టి తెలుస్తుంది. అనుష్క సిమ్రాన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఒక వర్గం వారికి నచ్చిన చాలామందికి ఈ సినిమా నచ్చలేదు. ముఖ్యంగా నందమూరి అభిమానులకు ఈ సినిమా తీరని బాధ మిగిల్చింది అని చెప్పవచ్చు. ఈ సినిమా విడుదల సమయంలో నందమూరి అభిమానులు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: