ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం కామెడీ షో కి కేరాఫ్ అడ్రస్ గా   మారిపోయింది అన్న విషయం తెలిసిందే. బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. అయితే జబర్దస్త్ కార్యక్రమం ఇండస్ట్రీ లోకి రావాలనుకున్న ఎంతో మంది కమెడియన్స్ కి లైఫ్ ఇచ్చింది. అయితే  ఇలా జబర్దస్త్ ద్వారా బాగా క్రేజ్ సంపాదించుకున్న కమెడియన్స్ లో అవినాష్ కూడా ఒకరు. జబర్దస్త్ కార్యక్రమంలో ముక్కు అవినాష్ గా పేరు తెచ్చుకున్న ఈ కమెడియన్ తన కామెడీ టైమింగ్ తో తెలుగు ప్రేక్షకులని ఆకర్షించాడు . అయితే ఆ తర్వాత బిగ్ బాస్ కార్యక్రమంలో కి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు అవినాష్.


 ఇక బిగ్ బాస్ కార్యక్రమంలో కి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇవ్వడంతో.. ఇక ఒక్కసారిగా జబర్దస్త్ లో అవకాశాన్ని కోల్పోయాడు. అయితే జబర్దస్త్ లో అవకాశం కోల్పోయినప్పటికి అటు స్టార్ మా లో ప్రసారమయ్యే పలు కార్యక్రమాలలో మాత్రం తనదైన శైలిలో కామెడీ పంచుతూ వచ్చాడు అవినాష్. ఇక బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత మరింత క్రేజ్ సంపాదించాడు అని చెప్పాలి. అయితే ఇటీవలే జబర్దస్త్ అవినాష్ పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడు అయ్యాడు అనే విషయం తెలిసిందే. ఇక జబర్దస్త్ అవినాష్ పెళ్లి ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.



 అవినాష్ పెళ్ళికి ఎంతో మంది సినీ సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. అయితే పెళ్లి తర్వాత అవినాష్ లో చాలా చేంజ్ వచ్చింది అని కొంతమంది సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ఫన్నీ కామెంట్స్ చేస్తూ ఉండటం గమనార్హం. అయితే ఇటీవలే అవినాష్ ఈటీవీ లో ప్రసారమయ్యే వావ్ అనే కార్యక్రమానికి కంటెస్టెంట్ గా వచ్చాడు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా పెళ్లి తర్వాత ఏం మారింది అంటూ సాయికుమార్ ప్రశ్నించగా.. పెళ్ళికి ముందు అన్నీ దొరికేవి కాని ఇప్పుడు అన్ని వదులుకోవాల్సి వస్తుంది అంట సమాధానం చెబుతాడు. ఇక ఇంతలో పక్కనే ఉన్న అరియనా కల్పించుకుని పెళ్లి తరువాత ఏకంగా ఫోన్ నెంబర్ కూడా చేంజ్ చేశాడు సార్ అంటూ చెప్పడంతో షాక్ అవుతారు అందరూ.

మరింత సమాచారం తెలుసుకోండి: