ప్రస్తుతం భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ప్రభాస్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి సినిమా ముందు వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో రెబల్ స్టార్ గా కొనసాగిన ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత మాత్రం ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. బాహుబలి సినిమా వరల్డ్ వైడ్ విజయం సాధించడంతో ఇక ప్రభాస్ కి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఏర్పడ్డారు అనే చెప్పాలి. ప్రభాస్ ఏదైనా సినిమాలో నటిస్తున్నాడు అంటే చాలు ఇక ఆ సినిమా కోసం అందరూ వేయికళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు.


కాగా ఇప్పటికే పలు పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నాడు ప్రభాస్. అయితే ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్న హీరోల్లో ప్రభాస్ కూడా ఒకరు. ప్రభాస్ కు అభిమానులే కాదు డై హార్డ్ ఫ్యాన్స్ కూడా ఎక్కువ మంది ఉన్నారు. ప్రభాస్ నటన కి, ఆయన బాడీకి కూడా ఎంతోమంది అభిమానులు ఉంటారు. అయితే సాధారణంగా సినీ హీరోల అభిమానులు తమ అభిమానాన్ని చాటు కోవడానికి వినూత్నంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇలా అభిమానులు చేసే ప్రయత్నాలు కొన్ని కొన్ని సార్లు  నిజంగా స్టార్ హీరోలను ఫిదా చేస్తూ ఉంటాయి.



 ఈ క్రమంలోనే ఇటీవలే ఒక వీరాభిమాని ప్రభాస్ పై తనకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. ఇక ఏకంగా అభిమాని చేసిన పనికి  ప్రభాస్ షాక్ అయ్యాడు అని చెప్పాలి. తలపై ప్రభాస్ అనే అక్షరాలు కనిపించేలా గుడ్డు కొట్టించుకున్నాడు ఆ అభిమాని. ఇది చూసిన ప్రభాస్ అతడిని కలిసి మాట్లాడారు. ఆ తర్వాత అభిమానికి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఇచ్చాడు ప్రభాస్. ఖరీదైన వాచ్ బహుమతిగా ఇచ్చాడు. ఇలా ప్రభాస్ అభిమానికి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన ఫోటో  సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.


ఇలా అభిమానంతో ఆశ్చర్యపరిచిన  అతనికి ఏకంగా ప్రభాస్ సినిమాలో ఒక సాంగు లో గెస్ట్ రోల్ ఇవ్వాలని ప్రభాస్ నిర్ణయించుకున్నాడు అంటూ టాక్ వినిపిస్తోంది. ఇక ఈ వార్త విని అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. అయితే ఇది ఎంతవరకు నిజం అన్నది మాత్రం తెలియాల్సి ఉంది

మరింత సమాచారం తెలుసుకోండి: