ఇప్పటికే కరోనా మహమ్మారి పంజా అనంతరం టాలీవుడ్ లో ఒకటి తరువాత మరొకటి సినిమాలు థియేటర్స్ లో విడుదల అవుతూ మంచి కలెక్షన్స్ దక్కించుకున్నాయి. ఇక రాబోయే సంక్రాంతి సందర్భంగా ఇప్పటికే పలు సినిమాలు బెర్త్ లు ఖాయం చేసుకున్నాయి. వాటిలో ముఖ్యంగా బడా స్టార్స్ సినిమాలైన భీమ్లా నాయక్, ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ పొంగల్ బాక్సాఫీస్ రేస్ లో ఉన్నాయి. వీటిలో పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమా జనవరి 12న రిలీజ్ కానుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మితం అవుతున్న ఈ సినిమాని సాగర్ కె చంద్ర తీస్తుండగా రానా మరొక కీలక రోల్ చేస్తున్నారు.

మలయాళ మూవీ అయ్యప్పనుం కోషియం కి రీమేక్ గా భీమ్లా నాయక్ రూపొందుతోంది. మరోవైపు భారతదేశంతో పాటు ఇతర దేశాల ఆడియన్స్ కూడా ఎప్పుడెప్పుడా అని ఎంతో ఎదురు చూస్తున్న పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ జనవరి 7న రిలీజ్ కానుంది. ఎన్టీఆర్, చరణ్ తొలిసారిగా కలిసి నటిస్తున్న ఈ సినిమా పేట్రియాటిక్ డ్రామా మూవీగా పలు కమర్షియల్, యాక్షన్ హంగులతో రూపొందుతుండగా దీనిని అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా ఎంతో అద్భుతంగా రాజమౌళి తెరకెక్కించినట్లు సమాచారం. ఇక వీటితో పాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా రాధేశ్యామ్ కూడా జనవరి 14న రిలీజ్ కానుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని రాధా కృష్ణ కుమార్ తీస్తుండగా యువి క్రియేషన్స్ వారు దీనిని పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఇక విషయం ఏమిటంటే, కేవలం కొద్దిరోజుల గ్యాప్ తో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలు ఒకేసారి రిలీజ్ కావడం వలన వాటికి థియేటర్స్ విషయమై అలానే కలెక్షన్స్ విషయమై చాలా వరకు పోటీ, ఇబ్బందులు తప్పదని, అందుకే వీటిలో ఏదో ఒకటి సంక్రాంతి రేస్ నుండి తప్పుకునే ఛాన్స్ ఉందని, ఈ విషయమై ఆయా సినిమాల నిర్మాతలు నేడు ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయగా టాలీవుడ్ కి చెందిన పలువురు పెద్దలు కూడా దీనికి హాజరయ్యారని, అలానే అతి త్వరలో వీటిలో ఏదో ఒకటి తప్పుకోవడం ఖాయం అని టాక్. అయితే వీటిలో ఏదైనా సినిమా తప్పుకుంటుందా లేక మూడు సినిమాలు కూడా బరిలో ఉంటాయా అనే విషయమై పూర్తిగా వివరాలు తెలియాలి అంటే అధికారిక న్యూస్ బయటకు రావాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: