‘ఆర్ ఆర్ ఆర్’ జనవరి 7న విడుదల అవుతున్న పరిస్థితులలో సంక్రాంతి రేస్ కు అప్పటికే పోటీ పడుతున్న ‘సర్కారు వారి పాట’ ‘భీమ్లా నాయక్’ ‘రాథే శ్యామ్’ సినిమాలు పోటీ పడుతున్నప్పటికీ రాజమౌళి ఆసినిమాల పోటీ గురించి ఎలాంటి భయము పడలేదు అన్నది వాస్తవం. అంతేకాదు సంక్రాంతి లాంటి పెద్ద పండుగకు రెండు మూడు పెద్ద సినిమాలు వచ్చినా నష్టం లేదు అంటూ మితిమీరిన ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించాడు.


అయితే మహేష్ మాత్రం ‘ఆర్ ఆర్ ఆర్’ మ్యానియా ముందు తన మూవీ నిలబడలేదు అని గ్రహించి వెనకడుగు వేసాడు. ఇప్పుడు ‘భీమ్లా నాయక్’ పరిస్థితి కూడ అదే అంటూ ప్రచారం జరుగుతోంది. దీనితో ఈసారి సంక్రాంతి రేస్ ‘ఆర్ ఆర్ ఆర్’ ‘రాథే శ్యామ్’ ల మధ్య అన్న విషయం ఓపెన్ సీక్రెట్ గా మారిపోయింది. ఇది అంతా రాజమౌళి గొప్పతనం అంటూ అతడి అభిమానులు మురిసిపోతున్నారు.


అలాంటి నేషనల్ సెలెబ్రెటీ రాజమౌళి అలియాభట్ దగ్గర ఒక మెట్టు దిగాడా అని కొందరి అభిప్రాయం. దీనికి కారణం జనవరి 6న దేశవ్యాప్తంగా విడుదల కాబోతున్న ‘గంగుభాయ్ కతియావాడి’ విడుదల తేదీని వాయిదా వేసుకోమని రాజమౌళి ఆమూవీ దర్శక నిర్మాతలతో చేసిన రాయబారాలు ఫలించినట్లు తెలుస్తోంది. ఈ మూవీ దర్శక నిర్మాతలు తమ మూవీని ‘ఆర్ ఆర్ ఆర్’ తో పోటీ పడకుండా ఆ రేస్ నుండి తప్పించి ఫిబ్రవరి 18న విడుదల చేయడానికి అంగీకరించారు.


ఈ విషయం పై రాజమౌళి స్పందిస్తూ ‘ఆర్ ఆర్ ఆర్’ తో పోటీ పడకుండా ‘గంగూభాయ్’ మూవీని ఫిబ్రవరికీ మార్చినందుకు ఆమూవీ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ కి అదేవిధంగా ఆమూవీ నిర్మాతలకు కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టారు. దీనితో రాజమౌళి టాలీవుడ్ టాప్ హీరోలు పవన్ మహేష్ ల కంటే బాలీవుడ్ క్రేజీ బ్యూటీ అలియాభట్ అంటే భయపడుతున్నాడా అంటూ కొందరు జోక్ చేస్తున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి: