టాప్ యంగ్ హీరోల మధ్య పోటీ కంటే చిన్న హీరోల మధ్య పోటీ విపరీతంగా ఉంది. ప్రస్తుతం వారానికి నాలుగు చిన్న సినిమాలు విడుదల అవుతున్నాయి. ఆ సినిమాల పేర్లు కూడ తెలియకుండానే వెళ్ళిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఒక చిన్న సినిమా బతకడం చాల కష్టంగా మారింది.



అయితే సినిమాల పై మోజుతో చిన్న సినిమాలు తీసే దర్శక నిర్మాతలు హీరో హీరోయిన్స్ లెక్కకు కూడ అందకుండా ప్రతి సంవత్సరం తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం అవుతూనే ఉన్నారు. ఇప్పుడు అలాంటి ఒక చిన్న సినిమా ఈవారం విడుదల కాబోతోంది. దానికి ‘రామ్ అసుర్’ అన్న పేరు పెట్టారు.



అభినవ్ సర్ధార్ చాందిని అనే హీరో హీరోయిన్స్ ఈమూవీ ద్వారా పరిచయం అవుతున్నారు. ఈసినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఇప్పటికే జరిగింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రకటనలు కూడ బాగానే ఇస్తున్నారు. అయినప్పటికీ ఈ సినిమాకు క్రేజ్ ఏర్పడక పోవడంతో ఈ మూవీ నిర్మాతలతో పాటు ఈ మూవీ హీరో హీరోయిన్స్ కు కూడ టెన్షన్ ఏర్పడటంతో ఈమూవీ ప్రమోషన్ కు ఒక కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు.



భాగ్యనగరం అంతా కలియ తిరుగుతూ ఖాళీగా గోడలు కనిపిస్తే చాలు వాటి పై ఈ సినిమాకు సంబంధించిన పోష్టర్లు అంటిస్తూ హీరో హీరోయిన్స్ ఇద్దరు హడావిడి చేసారు. నీట్ గా మేకప్ చేసుకుని ఉడకపెట్టిన మైదా పిండితో పోష్టర్లు అంటించుకుంటూ హడావిడి చేసిన వీరిద్దరి చుట్టూ జనం చేరి ఆకొత్త సినిమా గురించి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారట. అయితే ఇలా అడిగిన వారంతా ధియేటర్లకు వస్తారా రారా అన్నది వేచి చూడాలి. ఆమధ్య హీరో సుధీర్ బాబు తన సినిమా ‘శ్రీదేవి సోడా సెంటర్’ మూవీ కోసం ఇలాంటి స్ట్రీట్ పబ్లిసిటీ చేసినప్పటికీ జనం చూడటానికి బాగా వచ్చారు కానీ వారంతా ధియేటర్లకు రాలేదు. దీనితో చిన్న సినిమాలు ఎలా ప్రమోట్ చేయాలో తెలియక తెగ తికమక పడుతున్నారు..  




మరింత సమాచారం తెలుసుకోండి: