డిసెంబర్ మొదటి వారం నుండి భారీ సినిమాల క్యూ మొదలవుతోంది. ఫిబ్రవరి నెలాఖరి వరకు వరసపెట్టి విడుదల కాబోతున్న భారీ సినిమాల బిజినెస్ వేల కోట్ల పై ఉండబోతోంది. ఇన్ని భారీ సినిమాల మధ్య ఎన్ని సినిమాలు విజయం సాధిస్తాయి అన్న అంచనాలు ఎవరికీ అందడం లేదు. దేశవ్యాప్తంగా ఎన్నో భారీ సినిమాలు విడుదల అవుతున్నప్పటికీ అందరి దృష్టి మాత్రం ‘ఆర్ ఆర్ ఆర్’ పైనే ఉంది.


ఈమూవీకి జరిగిన భారీ బిజినెస్ రీత్యా బయ్యర్లు లాభపడాలి అంటే టిక్కెట్ల రేట్లు పెంచితీరాలి. అయితే తెలుగు సినిమాలకు గుండె లాంటి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. టిక్కెట్ల పెంపుకు ఏమాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరించడం లేదు. దీనితో నాగార్జున లాంటి టాప్ హీరోలు దిల్ రాజ్ లాంటి ప్రముఖ నిర్మాతలు ఎన్ని రాయబారాలు చేసినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి స్పందన రావడం లేదు.


ఇలాంటి పరిస్థితులలో ‘ఆర్ ఆర్ ఆర్’ నిర్మాతలకు బయ్యర్లకు విపరీతమైన పెరిగిపోతోంది. ‘ఆర్ ఆర్ ఆర్’ టిక్కెట్ల రేట్ల పెంపు విషయమై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరించకపోతే ‘ఆర్ ఆర్ ఆర్’ బయ్యర్లకు కోట్ల రూపాయలలో నష్టాలు వచ్చే అవకాశం ఉంది అంటూ ప్రచారం జరుగుతోంది. దీనితో ఈ విషయమై ఒక పరిష్కారం కనుగొనడానికి ‘ఆర్ ఆర్ ఆర్’ నిర్మాతలతో పాటు రాజమౌళి జూనియర్ చరణ్ లు కలిసి త్వరలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ను కలిసి తమ కష్టాలు వివరించాలని అపాయింట్ మెంట్ కోరుతున్నట్లు టాక్. ఈ అపాయింట్ మెంట్ దొరుకుతుందా దొరికినా వీళ్ళు చెప్పే విషయాలకు ఎలాంటి స్పందన వస్తుంది అన్న విషయం ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్న. ఈ పరిస్థితుల పై సమాధానాలు లేనప్పటికీ ఎదో ఒక మంచి జరుగుతుంది అన్న ధైర్యంతో వరసపెట్టి భారీ సినిమాలు అన్నీ క్యూ కడుతూ వందల కోట్ల కలక్షన్స్ ను కొల్లగొట్టడానికి భారీ స్కెచ్ వేసుకుంటున్నాయి..




మరింత సమాచారం తెలుసుకోండి: