మహానటి సావిత్రి తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ హీరోయిన్ గా కొనసాగింది.. అయితే ఆమె స్థానాన్ని ఇప్పటికీ ఎవరు పూడ్చలేకపోతున్నారు. అంతేకాదు ఈమె సహాయం చేసినంతగా ఏ ఒక్కరు కూడా సహాయం చేయలేదనే చెప్పాలి. గుంటూరు జిల్లాలోని చిర్రారావు గ్రామంలో జన్మించిన ఈమె చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయింది. ఆ తర్వాత తన పెదనాన్న ఆశ్రయం ఇవ్వడంతో తన తల్లితో కలసి అక్కడే జీవిస్తూ ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. అయితే కంటికి రెప్పలా కాపాడుకున్న తన పెదనాన్న ఆమెను ఒక స్టార్ హీరోయిన్ గా చూడాలని అనుకున్నారట.

మొదటిసారి నాటకాలు వేసుకుంటూ.. హిందీ నటుడైన పృథ్విరాజ్ కపూర్ చేతుల మీదుగా సన్మానం పొందడం ఆమె విజయానికి మొదటి నాంది అయింది. చిన్న పాత్రలతో తన ప్రస్థానం మొదలుపెట్టిన సావిత్రి అగ్రకథానాయికగా అనతికాలంలోనే ఎదిగింది. తెలుగు , తమిళ్ లో తనకంటూ ఒక ముద్రవేసుకుని.. నడిగర్ తిలగం అనే బిరుదు పొందింది. ఆ తర్వాత తమిళ నటుడు జెమినీ గణేశన్ ను పెళ్ళిచేసుకుని తీవ్రంగా మోసపోయింది. ఇకపోతే ఖరీదైన కార్లు,లగ్జరీ బంగ్లాలు, ఎన్నో బంగారు ఆభరణాలు , వెండి వస్తువులను వాడిన ఏకైక నటిగా గుర్తింపు పొందింది.


ఆ డబ్బును అంతా  పేద ప్రజలకు పంచి పెట్టింది.. ఒకానొక సమయంలో ఒక కారు డ్రైవర్ కూతురికి పెళ్లి చేయవలసి వస్తే, తను చీరలు కూడా అమ్మి అతడికి డబ్బులు సహాయంగా ఇచ్చింది. అంతే కాదు ఎంతో మందికి వివాహాలు జరిపించి ప్రతిసారి అన్నదాన కార్యక్రమాలను కూడా నిర్వహించేది. ఆ కాలంలోనే అన్నపూర్ణ గా గుర్తింపు పొందిన సావిత్రి ఎంతమందిని ఆదుకున్నారో కూడా లెక్కల్లో చెప్పలేము. అంత గొప్పగా బ్రతికిన సావిత్రి చివరి క్షణాలలో ఆర్థిక ఇబ్బందులతో ఎన్నో సమస్యలను ఎదుర్కొని, చివరికి ఆమె ఒక సంవత్సరం పాటు కోమాలో ఉండి..చివరకు తన  అంత్యక్రియలకు కూడా డబ్బులు మిగల్చని  స్థితిలో చనిపోయింది. ఇక దాసరి నారాయణరావు దగ్గరుండి ఆయన అంత్యక్రియలను తన సొంత డబ్బులతో చేయడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: