తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని అమల గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె నటనతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు.. ఆమె కింగ్ నాగార్జునని పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరమైయ్యారు. ఆమె కుటుంబ బాధ్యతలను చూసుకుంటూ సంతోషంగా జీవితం గడుపుతున్నారు. అయితే అక్కినేని ఇంటికి కోడలుగా వెళ్లిన అమల వ్యక్తిగానూ తాను ఎంత శక్తిమంతమో ప్రతి సందర్భంలో నిరూపించుకుంటూ ఉంది.

అమల తన భర్త నాగార్జున ఓ వైపు హీరోగా, మరో వైపు నిర్మాతగా, ఇంకో వైపు స్టూడియో అధినేతగా, ఇవి కాక ఎంటర్ టైన్ మెంట్ మీడియా భాగస్వామిగా, హోస్ట్ గా, ఆంట్రప్రెన్యూర్ గా సాగుతూ ఉండగా, అర్ధాంగిగా ఆయనకు అన్ని విధాలా నైతికబలాన్ని అందిస్తూ తోడుగా నిలుస్తూ వస్తుంది. అంతేకాదు.. నేటి యువ కథానాయకుడిగా తనయుడు అఖిల్ ను తీర్చిదిద్దే ప్రయత్నంలోనూ ఆమె సహకారం అందిస్తూ ఉంది. అయితే అమల బెంగాల్ లో జన్మించారు. ఆ తరువత చెన్నైలోని ‘కళాక్షేత్ర’లో చేరి భరతనాట్యంలో బి.ఎఫ్.ఏ పూర్తి చేశారు. అంతేకాదు.. అమల ప్రపంచవ్యాప్తంగా పలు నాట్య ప్రదర్శనలు కూడా చేశారు.

అయితే ఆమె నాట్య ప్రదర్శనాని చూసిన డైరెక్టర్ టి.రాజేందర్, అమలను సినిమాలో నటిస్తావా అని అడిగారట. అమల అమ్మగారి అంగీకారంతో మైథిలీ ఎన్నై కాదలి’ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ సినిమా మంచి విజయాన్ని గుర్తింపుని తీసుకొచ్చింది. అమల, నాగార్జున నటించిన ‘కిరాయిదాదా’ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమైయ్యారు. అంతేకాదు.. ఆమె తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మళయాళ భాషల్లో అమల నటించిన అనేక చిత్రాలు నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక అమల జంతు సంరక్షణ కోసం ‘బ్లూ క్రాస్ సంస్థ’ను ఏర్పాటు చేసి, తద్వారా జంతువులను తాను ఎంతగా ప్రేమిస్తున్నానో నిరూపించారు. అంతేకాక.. ప్రస్తుతం సాగుతున్న అమల ఒకప్పుడు అందాలతారగా జేజేలు అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: