సినీ ఇండస్ట్రీలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో విలక్షణ నటుడిగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు ప్రకాశ్ రాజ్. అగ్ర హీరోల సినిమాల్లో విలన్ పాత్రలతో ప్రేక్షకులను అలరించి పలు అవార్డులను కూడా సొంతం చేసుకున్న ఆయన నిజ జీవితంలో మాత్రం కష్టాల్లో ఉన్న వారికి సాయం చేస్తూ తన గొప్ప మనసును చాటుతూ వస్తున్నారు.తన పేరిట ఓ ఫౌండేషన్ ని నిర్మించి.. దాని ద్వారా ఎంతో మంది పేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. తన ఫౌండేషన్ ద్వారా 1000 కుటుంబాలకు సాయాన్ని అందిస్తున్నారు.అంతేకాకుండా ఓ గ్రామాన్ని కూడా దత్తత తీసుకొని..

ఆ గ్రామాన్ని తన సొంత ఖర్చుతో అభివృద్ధి చేస్తున్నారు.ఇక మరోవైపు ఎంతో మంది పిల్లల చుదువుకి కూడా సాయం అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.ఈ క్రమంలోనే పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన ఓ పేద విద్యార్థినికి విదేశాల్లో చుదువుకోవడానికి సహాయం చేసాడు.పశ్చిమ గోదావరి కి చెందిన సిరి చందనకి విదేశాల్లో మాస్టర్స్ డిగ్రీ చేయాలనేది తన కల.కానీ టాలెంట్ ఉన్నా ఆమెకి విదేశాలకు వెళ్లి చదువుకొనే ఆర్ధిక పరిస్థితి లేదు.అయితే సోషల్ మీడియాలో ఆధారంగా ఆ నిరుపేద విద్యార్థిని ఆశయం గురించి తెలుసుకొని..ఆ అమ్మాయిని విదేశాల్లో చదివించే బాధ్యతను తీసుకున్నాడు.

ఈ క్రమంలో నే యూకే మాంచెస్టర్ సిటీలోని సాల్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ఆ అమ్మాయికి ఉన్నత చదువులు ( Higher studies in UK ) చదువుకునే అవకాశం కల్పించాడు.ఇక ఆ అమ్మాయి కాలేజి ట్యూషన్ ఫీజు,అలాగే ఆమె అక్కడ ఉండేందుకు అయ్యే వసతి వాటికి సంబంధించిన ఖర్చు మొత్తాన్ని ప్రకాష్ రాజ్ స్వయంగా చెల్లించారు.ఇక ప్రకాష్ రాజ్ సాయాన్ని అందుకున్న సిరి చందన ఆయన్ని కలుసుకొని కృతజ్ఞతలు తెలిపింది.అలా కష్టాల్లో ఉన్నవారి గురించి తెలుసుకొని తనకు వీలైనంత సాయం అందిస్తూ ముందుకు సాగుతున్నారు ప్రకాష్ రాజ్.ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని, ప్రకాష్ రాజ్ ని ఆదర్శంగా తీసుకొని మిగతా నటీ నటులు కూడా పేద వారికి సహాయ పడాలని కోరుకుందాం...!!

మరింత సమాచారం తెలుసుకోండి: