నవంబర్ 16న బెంగుళూరు ప్యాలెస్ గ్రౌండ్స్  లో కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సంస్మరణ సభ జరిగింది. ఈ సభకు దేశం నలుమూలల నుండి పునీత్ వీరాభిమానులు. పునీత్ తో సన్నిహిత సంబంధాలు ఉన్న ప్రముఖులు హాజరయ్యారు . ఈ సందర్భంగా పవర్ స్టార్ తో వారికున్న అనుబంధాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. కొందరైతే కన్నీరు పెట్టుకున్నారు . అంతే కాకుండా సినీ రాజకీయాలకు సంబందించిన ప్రముఖులు కూడా హాజరయ్యారు.

 
ఈ కార్యక్రమానికి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మే , మాజీ ముఖ్య మంత్రి యడ్యూరప్ప మరియు పలువురు ఎమ్మెల్యేలు , ఎంపీ లు హాజరయ్యారు . అంతే కాకుండా పునీత్ చేసిన మంచి పనులు ఇంకా అతని గొప్పతనం గురించి చెబుతూ కొనియాడారు. అంత సవ్యంగా సాగుతున్న ఈ కార్యక్రమం లో కన్నడ స్టార్ హీరో దర్శన్ కి చేదు అనుభవం ఎదురయ్యింది . D బాస్ గా పిలుచుకునే కర్ణాటక ప్రజలు ఈ విషయం తెలిసి ఒక్కసారిగా షాకయ్యారు. అయితే కర్ణాటకలో ఈయన టాప్ 5 హీరోస్  లో ఈయన ఒకరు  . ఇలాంటి హీరోకు బెంగుళూరు ప్యాలస్ గ్రౌండ్ ఎంట్రెన్స్ లో ఘోర అవమానం జరిగింది.
IHG



పునీత్ సంస్మరణ సభకు విచ్చేసిన దర్శన్ కు గేటు దగ్గర పోలీసులు నిలిపివేశారు . స్టేడియం లోపల ఆడిటోరియం ఫుల్ అయిందని అంతే కూండా సీట్లు కూడా లేవని తెలుపుతూ దయచేసి ఇక్కడినుండి వెళ్లిపోవాలని పోలీసులు అతడిని వారించారు. అయితే దర్శన్ మాత్రం సభకు కచ్చితంగా వెళ్లి తీరాలని పట్టుబట్టారు ..లేని పక్షం లో కనీసం ఆడిటోరియం లో కాసేపు నిలబడి కార్యక్రమాన్ని వీక్షించి వెళతానని రిక్వెస్ట్ చేసారు. అయినప్పటికీ వాళ్ళు పట్టించుకోకుండా ఆ స్టార్ హీరో ని నిలువరించే ప్రయత్నం చేశారు.





 సభకు విచ్చేసిన అతని తో పటు అతని అనుచరులు మరియు యువ హీరో వినోద్ ప్రభాకర్ కూడా ఉన్నారు. ఈ వినోద్ ప్రభాకర్ కన్నడ ప్రభాకర్ కుమారుడే..అయితే కొద్దిసేపటికి ఈవెంట్ ని నడుపుతున్న అధికారులు వచ్చి దర్శన్ ను మరియు అతని అనుచరులను మరియు వినోద్ ప్రభాకర్ ను లోపలి తీసుకువెళ్లారు. లోపలి వెళ్లినా కూడా దర్శన్ కి ఉపయోగం లేకపోయింది. అతనికి సీట్లు లభించలేదు. అప్పటికి అతడు సాధారణ క్లాస్ లో కూర్చున్నాడు . చాల ఇబ్బందికి గురైన అతడు సభ మధ్యలోనే బయటకు వెళ్ళిపోయాడు. ఈ సన్నివేశానికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ ఉంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: