టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ కి 'జయం' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నితిన్.. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా ఆశించిన ఫలితాన్ని అందుకోలేక పోయాడు. ఇక ఆ తర్వాత నితిన్ నటించిన ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే వంటి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇటీవల నితిన్ నటించిన భీష్మ, రంగ్ దే, మాస్ట్రో చిత్రాలు కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. అయితే నితిని తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను బయట పంచుకోవడానికి అంతగా ఇష్టపడరు. అలాంటి నితిన్ పర్సనల్ లైఫ్ కి సంబంధించి కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

నితిన్ అసలు పేరు నితిన్ కుమార్ రెడ్డి. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి కొడుకే మన నితిన్. ఇక నితిన్ కు నిఖితారెడ్డి అనే సోదరి కూడా ఉంది. బేగంపేటలోని గీతాంజలి స్కూల్ లో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన నితిన్.. రత్న కాలేజ్ లో తన ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాడు. ఇక ఆ తర్వాత తన గ్రాడ్యుయేట్ ని గండిపేటలో ని 'షాదన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ' లో  పూర్తి చేశాడు. ఇక తన తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మాతగా మారి గుండెజారి గల్లంతయిందే, చిన్నదాన నీకోసం అనే సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఇక 2020లో తన ఫ్రెండ్ శాలినీ కందుకూరు తో నిశ్చితార్ధం చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత ఫలక్నుమా ప్యాలస్ లో శాలిని ని పెళ్లి చేసుకున్నాడు.

 నితిన్ నటించిన భీష్మ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఈ సినిమా దర్శకుడు వెంకీ కుడుములకి 59 లక్షలు విలువచేసే రేంజ్ రోవర్ కారును నితిన్ గిఫ్ట్ గా ఇచ్చాడు. నితిన్ ఒక సినిమాకు ఆరు నుంచి ఏడు కోట్ల వరకు పారితోషికం తీసుకుంటాడు. ఇక 2017 లో దాదాపు 50 లక్షలకు పైగా ఖర్చు చేసి జాగ్వర్ ఎస్ ఎఫ్ అనే కారు కొన్నాడు. ఆ తర్వాత 75 లక్షలకు పైగా విలువ చేసే బీ ఏం యూ యూ ఎక్స్ 5 కార్ ను సొంతం చేసుకున్నాడు. ఇది వాటితో పాటు కోటి 20 లక్షల విలువ చేసే పోర్షే కయెన్, హోండా సీ ఆర్ వీ, ఇన్నోవా క్రిస్టా , వోక్స్ వేగన్ పాసట్  కూడా నితిన్ గ్యారేజీలో ఉన్నాయి. అంతే కాకుండా 16 లక్షల 90 వేల విలువగల బైక్ కూడా ఉంది. ఇక రోడ్ నెంబర్ టెన్ లో దాదాపు 8 లక్షల విలువ కలిగిన సొంత ఇల్లు నితిన్ కి ఉంది. ఇక 2013వ సంవత్సరంలో ఓ సొంత ఫిలిం ప్రొడక్షన్ స్టూడియోను కూడా నిర్మించాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: