జూనియర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ హీరోలుగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'రౌద్రం రణం రుధిరం'. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని సుమారు 450 కోట్ల భారీ బడ్జెట్తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఇక సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరీస్ చరణ్ కి జోడిగా బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ నటిస్తున్నారు. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఓ రేంజ్ లో మొదలైన సంగతి తెలిసిందే. ప్రమోషన్స్లో భాగంగా ఈ సినిమా నుండి విడుదల చేసిన గ్లిమ్స్ వీడియో ఆడియన్స్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఇక తాజాగా సినిమా నుంచి నాటు నాటు అంటూ సాగే మరో పాటను విడుదల చేశారు చిత్ర యూనిట్.

 ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియా మొత్తాన్ని షేక్ చేస్తోంది. ఈ పాట తో మరోసారి సినిమాపై అంచనాలను తారా స్థాయికి చేర్చారు రాజమౌళి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ కి జోడీగా కనిపించనున్న ఒలీవియా బ్యాక్ గ్రౌండ్ గురించి చాలా ఆసక్తికర విషయాలు ఉన్నాయి. 1997 లండన్లో జన్మించింది ఒలివియా మోరీస్. చిన్నప్పటి నుంచే తన అమ్మమ్మ దగ్గర పెరిగిన ఈమె చిన్న తనంలోనే టీవీ, ఫిల్మ్ రంగాలపై ఎంతో ఆసక్తిని పెంచుకుంది. స్కూల్ ఏజ్ లో ఉండగానే ఆర్టీఏ లెవెల్ లో శిక్షణ తీసుకుంది. ఆ తర్వాత యాక్టింగ్ టీచర్ గా కూడా పనిచేసింది. ఇక తర్వాత లండన్ లో రాయల్ వెల్ష్ మ్యూజిక్ డ్రామా కాలేజ్‌లో డిగ్రీ కంప్లీట్ చేసింది.

 ఇక ఆ తర్వాత కేవలం ఏడు రోజుల్లోనే మినీ అడ్వెంచర్ టీవీ సీరీస్ పూర్తి చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాదు ఈమె అనేక ఫ్యాషన్ వీక్ ర్యాంప్ షోలలో పాల్గొంది ఇక ఆ తర్వాతే రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించేందుకు ఎంపికైంది.ఇక ఎప్పుడైతే ఆర్ ఆర్ ఆర్ సినిమాలో తాను నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయో.. అప్పటినుంచి గూగుల్ లో ఈమె గురించి ఎక్కువగా సెర్చ్ చేయడం మొదలు పెట్టారు సినీ జనాలు. దీంతో ఒలివియా కి సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలు బయటికివచ్చాయి. ఇక ఆర్ ఆర్ ఆర్ సినిమాలో బ్రిటిష్ యువరాణి గా కనిపించనుంది ఒలివియా. సినిమాలో ఈమె పాత్ర కూడా ఎంతో కీలకంగా ఉండబోతోందని తెలుస్తోంది.ఇక సినిమాలో ఈమెతో పాటు రే స్టీవెన్ సన్, అలిసన్ డూడీ వంటి మరికొందరు హాలీవుడ్ నటీ నటులు నటిస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: