ఇండస్ట్రీలో విలన్ పాత్రలు చేస్తూ నిజ జీవితంలో అసలైన హీరోగా గుర్తింపుతెచ్చుకున్న నటుడు సోనూసూద్. ఆయన కరోనా సమయంలో కలియుగ కర్ణుడిగా మారాడు. సాయం అని వచ్చిన వారందరికీ సహాయం చేస్తూ పేదలపాలిట దేవుడిగా మారాడు. ఇక కరోనా సమయంలో నటుడు సోనూ సూద్ చేసిన సాయం ఎప్పటికి ఎవరు మర్చిపోలేరు. ఆయన వలస కార్మికుల కోసం చేసిన సాయాన్ని ప్రజలు ఎప్పటికీ గుర్తుకు పెట్టుకుంటూనే ఉంటారు. ఆయన కష్టకాలంలో ఆపదలో ఉన్న వారికి ఆపద్భాందవుడిగా నిలిచి అందరి మనసులలో చెరగని ముద్ర వేసుకున్నాడు.

అంతేకాదు.. లాక్‌డౌన్ సమయంలో ఆయన చేసిన సామాజిక సేవలు వెలకట్టలేనివి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సోనూసూద్ కార్మికులని వారి సొంత గ్రామాలకి తరలించేందుకు బస్సులు, రైళ్ళు, చార్టర్డ్ ఫ్లైట్స్ ఏర్పాటు చేశాడు. అంతేకాదు.. సొంత ఖర్చులతో ప్రతి ఒక్కరిని వారి గూటికి చేర్చడంపై సోనూ సూద్ చేసిన సేవకు దేశ వ్యాప్తంగా ప్రజలు ప్రశంసలు అందుకున్నారు. అంతేకాదు.. ఆయన చేసిన సాయానికి మరికొందరు అయితే వీరాభిమానులుగా మారారు.

ఇక ఇప్పటికి సోనూ సూద్‌ తన తన బాధ్యత ఇంకా పూర్తి కాలేదంటున్నారు. అంతేకాక.. లాక్ డౌన్ సమయంలో వివిధ ప్రమాదాలలో మరణించిన లేదా గాయపడ్డ వలన కార్మికుల కుటుంబాలకి సాయం చేయాలని నిర్ణయం కూడా తీసుకున్నారు. అయితే ఇప్పటికే ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ సహా వివిధ రాష్ట్రాల అధికారులతో సంప్రదించి ప్రాణాలు కోల్పోయిన కార్మికులు, సంబంధిత సమాచారం చిరునామాలు, బ్యాంక్ వివరాలను తెలుసుకొని సుమారు 400 కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తామని సోనూ సూద్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. సోనూసూద్ చేస్తున్న సేవలకు ప్రతి ఒక్కరు కొనియాడతున్నారు. ఆయన చేస్తున్న సేవలకు ప్రభుత్వం ఆయనకు సత్కారాని అందజేసింది. అంతేకాదు.. ఆయనకు గుడిని కూడా కట్టించారు. ప్రస్తుతం ఆయన పంజాబ్ రాష్ట్రానికి బ్రాండ్ అంబాడిసర్ గా పని చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: