ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఆ నలుగురు ఏమి చెపితే అది జరిగే విధంగా పరిణామాలు ఉంటున్నాయి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీని శాసిస్తున్న ఆ నలుగురు లో అల్లు అరవింద్ ఒకరు అన్నది ఓపెన్ సీక్రెట్. గతంలో అల్లు అరవింద్ కోరడంతో నాగశౌర్య ‘వరుడు కావలెను’ మూవీని దసరా రేసు నుండి తప్పించి అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ కు మొనోపలి గా దసరా హీరో అవ్వడానికి సహకరించాడు అని అంటారు.

 

 అదే దసరా కు నాగశౌర్య ధైర్యం చేసి అఖిల్ తో పోటీగా దసరా రేస్ కు వచ్చి ఉంటే తన ‘వరుడు కావలెను’ మూవీకి ఒక మాదిరి కలక్షన్స్ అయినా వచ్చి ఉండేవి అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు అల్లు అరవింద్ ఒత్తిడికి నాని ‘శ్యామ్ సింగ రాయ్’ తలఒగ్గవలసిన పరిస్థితి ఏర్పడింది అంటూ వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఈ పరిస్థితి అంతా ‘అఖండ’ వల్ల ఏర్పడింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

 

 వరుణ్ తేజ్ ‘గని’ మూవీ ఎప్పుడో విడుదల కావలసి ఉంది. ఈమూవీ అల్లు అరవింద్ తనయుడు బాబి నిర్మించడంతో చాల ఆలోచించి డిసెంబర్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్ చేసారు. అయితే ఇప్పుడు ఆ డేట్ కు ‘అఖండ’ వచ్చి పడుతూ ఉండటంతో వరుణ్ తేజ్ మూవీని వెనక్కు జరిపి డిసెంబర్ 24న విడుదల చేస్తున్నారు. దీనితో ఎప్పటి నుంచో ఇదే డేట్ ను నమ్ముకున్న నాని పరిస్థితి అయోమయంలో పడింది.

 

 వాస్తవానికి నానీకి తన ‘శ్యామ్ సింగ రాయ్’ మూవీ పై చాల నమ్మకం ఉండటంతో వరుణ్ తేజ్ తో ఫైట్ కు రెడీ అవుతున్నప్పటికీ ఆ ఫైట్ అల్లు అరవింద్ కు ఇష్టం లేక నానీని తన మూవీ రిలీజ్ ను సంక్రాంతి తరువాత విడుదల చేసుకోమని సలహాలు ఇస్తున్నట్లు టాక్. వాస్తవానికి ఇలాంటి సలహా మరొక వ్యక్తి ఇస్తే నాని పెద్దగా పట్టించుకొడు. అయితే ఇక్కడ సలహా ఇస్తున్నది అల్లు అరవింద్ కాబట్టి ఈ విషయాన్ని ఎలా సున్నితంగా డీల్ చేయాలి అని నాని మధన పడుతున్నట్లు టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి: