క్రేజీ హీరోయిన్ కాజల్ ఇండస్ట్రీలోకి వచ్చి 15 సంవత్సరాలు దాటిపోయింది. దక్షిణాది సినిమా రంగంలో ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో కాజల్ కు ఎన్నో సూపర్ హిట్స్ ఉన్నాయి. గత సంవత్సరం కరోనా సమయంలో కాజల్ గౌతమ్ కిచ్లూ ను ప్రేమించి పెళ్ళి చేసుకుంది.


ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న నేపధ్యంలో కాజల్ తన భర్తతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ గత కొంత కాలంగా హడావిడి చేస్తోంది. గౌతమ్ కిచ్లూ రూపు రేఖలు బాగుండటంతో అతడికి సినిమాలలో అవకాశాలు ఇప్పించవచ్చు కదా అంటూ నెటిజన్స్ ఆమెకు సలహాలు కూడ ఇచ్చారు.


ప్రస్తుతం కాజల్ గర్భవతి అన్న ప్రచారం జరుగుతోంది. అయితే కాజల్ నుంచి ఈ విషయమై ఎటువంటి స్పందన లేదు. కానీ శంకర్ కమలహాసన్ తో తీస్తున్న ‘ఇండియన్ 2’ సీక్వెల్ లో కాజల్ ను తొలగించి ఇప్పుడు త్రిష ను ఎంపిక చేసారు అని వార్తలు వస్తూ ఉండటంతో కాజల్ గర్భవతి కావడం వల్లే ఈమార్పు వచ్చిందని ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతూ ఉండగా కాజల్ తనకు తెలిసిన దర్శక నిర్మాతలకు హీరోలకు ఫోన్ చేసి తన భర్త గౌతమ్ కిచ్లూ కు సినిమాలలో అవకాశాలు ఇమ్మని అడుగుతోందట.


అంతేకాదు తన భర్తకు సినిమాలు అంటే చాల ఇష్టం అనీ దీనితో హీరో పాత్రలు కాకపోయినా ఎదో ఒక పాత్ర ఇచ్చి అతడిని ప్రోత్సహించమని అడుగుతోందట. దీనితో అనేకమంది దర్శక నిర్మాతలు హీరోలకు హీరోయిన్స్ కు వారసులు గా పిల్లలు రావడం చూసాము కానీ ఇలా భర్తల వారసత్వం ఏమిటి అంటూ జోక్ చేసుకుంటున్నారట.. గౌతమ్ కు కూడా నటన పై ఆసక్తి ఉండటంతో ఆమెతో ఇప్పటికే ఒక ప్రమోషనల్ వీడియోలో నటించాడు. ఇంతకు ముందు నటన లో గౌతమ్ కిచ్లూ శిక్షన కూడా తీసుకున్నాడు అనేది టాక్.





మరింత సమాచారం తెలుసుకోండి: