ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులందరికీ ఆకర్షిస్తూ టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది బిగ్ బాస్ రియాలిటీ షో. ఇప్పటికి పది వారాలు పూర్తి చేసుకున్న బిగ్బాస్ కార్యక్రమం 11వ వారం లోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలోనే 19 మంది తో మొదలైన ఈ బిగ్ బాస్ జర్నీ లో ప్రస్తుతం హౌస్ లో 19 మంది కంటెస్టెంట్ లు మాత్రమే ఉన్నారు. అయితే ఈ వారం హౌస్ నుండి బయటకు వెళ్లడానికి కెప్టెన్ గా ఉన్న రవి మినహా మిగతా ఎనిమిది మంది సభ్యులు కూడా నామినేట్ అయ్యారు. ఈ క్రమంలోనే ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు అనేది మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ ఎంతో రసవత్తరంగా సాగుతోంది.



 అయితే ఫస్ట్ కెప్టెన్సీ పోటీదారులుగా మానస్ అండ్ పింకీ బెలూన్ టాస్క్ ఆడిన విషయం తెలిసిందే. ఇందులో ఎక్కువగా బేలన్స్ పెల్చిన పింకీ మొదటి కెప్టెన్సీ పోటీదారుగా నిలిచింది. ఇక సిరి సన్నీకి కెప్టెన్సీ పోటీదారులుగా నిలవడానికి స్విమ్మింగ్ పూల్ టాస్క్ ఇచ్చారు. దీనిలో సిరి కి బదులుగా మానస్ పోటీలో దిగారు. ఈ పోటీలో సన్నీ ఓడిపోయాడు. ఇంట్లో సిరి రెండవ కెప్టెన్సీ కంటెండర్ గా నిలుస్తుంది. ఇక యాని మాస్టర్ మూడో కెప్టెన్సీ పోటీదారులుగా నిలుస్తుంది. నాల్గవ కెప్టెన్సీ పోటీదారులుగా మానస్ ఎంపిక అవుతాడు. అయితే ఈ నలుగురికి బిగ్బాస్ కెప్టెన్ అవ్వడానికి ఒక టాస్క్ ఇవ్వగా ఈ టాస్క్ లో మానస్ విజయం సాధించినట్లు తెలుస్తోంది.


 బిగ్బాస్ మొదలైనప్పటి స్ట్రాంగ్  కంటెస్టెంట్ గా కొనసాగుతున్నాడు మానస్. కానీ ఇప్పటివరకు ఒక్క సారి కూడా హౌస్లో కెప్టెన్సీని దక్కించుకోలేక పోయాడు. ఈ క్రమంలోనే ఇటీవల కెప్టెన్గా గెలుపొందినట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఇక ఈ వారం నామినేషన్ లో కూడా ట్విస్ట్ ఉండబోతోందని తెలుస్తోంది. ఈ వారం ఇద్దరు ఎలిమినేషన్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు ఈ క్రమంలోనే ప్రియాంక,యాని ఇద్దరు కూడా బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ కాబోతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: