ఇటీవ‌ల జ‌రిగి న మా ఎన్నికల్లో మంచు విష్ణు ఫ్యానెల్ వ‌ర్సెస్‌ ప్రకాష్ రాజ్ ఫ్యానెల్‌ మధ్య ప్రచారం ఎంత హోరాహోరీగా జరిగిందో ? మాటల తూటలు ఎలా పేలాయో ? ఎంత రచ్చ జరిగిందో ? అంతా చూసాం. మా ఎన్నికలు ముగిశాయి.. మంచు విష్ణు విజయం సాధించారు. ఇప్పుడు అంతా నిశ్శబ్దంగా ఉంది. మా ఎన్నికలను 24 గంటల పాటు ప్రసారం చేసిన మీడియా వాళ్లు కూడా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. మా ఎన్నికల్లో ఓడిపోయిన ప్రకాష్ రాజ్ ఫ్యానెల్ కు చెందిన వారంతా తమ పదవులకు రాజీనామాలు చేశారు. అయితే ఇప్పుడు అంతా నిశ్శబ్దం నెలకొంది.

మా ఎన్నిక‌ల్లో గెల‌వ‌డ మే త‌రువాయి.. భవనం కట్టేస్తాం, స్థలం చూసేస్తాం అంటూ ఎన్నికలకు ముందే కారులో వెళ్తూ సోషల్ మీడియాలో లైవ్ వీడియోలు పెట్టి నానా హంగామా చేశారు మంచు విష్ణు. ఆయ‌న తండ్రి సీనియ‌ర్ న‌టుడు మోహ‌న్ బాబు కూడా ఎన్నోన్నో హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఆయ‌న మా అధ్య‌క్షుడి గా ఉన్నారు. మంచు విష్ణు మా అధ్య‌క్షుడిగా గెలిచి రెండు నెల‌లు అవుతోంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క‌టి నెర‌వేర్చ‌లేదు.

అస‌లు మా భ‌వ‌నం గురించి అతీ గ‌తీ లేదు. విష్ణు గెలిచే ముందు వ‌ర‌కు ఒక‌లా ఉన్నారు.. ఇప్పుడు ఆయ‌న‌లో మాత్రం ఆ స్పీడ్ కనిపించడంలేదు. అయితే విష్ణు మా అధ్య‌క్షుడి హోదాలో మాత్రం సినిమా ఓ పెనింగ్ ల ఫంక్ష‌న్ల తో పాటు ఇండ‌స్ట్రీ వాళ్ల ఫంక్ష‌న్లు.. ఇత ర పంక్ష‌న్ల‌కు హాజ‌రు అవుతున్నారు. మా అధ్య‌క్షుడు అన్న ట్యాగ్ ఇప్పు డు చేర‌డంతో ఇలా బిజీ అయిపోయి.. మా భ‌వ‌నం మాట మ‌ర్చిపోయిన‌ట్టే క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. మ‌రి విష్ణు త‌న రెండేళ్ల పాల‌నా కాలంలో మా భ‌వ‌నం క‌డ‌తాడో ?  త‌న హామీని నెర‌వేర్చు కుంటాడో ?  లేదో ?  చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: