ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకుల చూపును ఆకర్షిస్తున్న బిగ్ బాస్ కార్యక్రమం  ఇటీవల 11వ వారం లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఇక 11వ వారం లో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అనే విషయం మరో రెండు రోజుల్లో తెలిసిపోతుంది. అయితే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ పోటీదారుల కోసం ఇచ్చిన టాస్కు ఎంతో రసవత్తరంగా సాగుతుంది అని చెప్పాలి. కెప్టెన్సీ దక్కించుకునేందుకు ఎవరికి వారు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. బిగ్బాస్ ఇచ్చిన టాస్క్ లో  హోరాహోరీగా గేమ్ ఆడుతూ ఉన్నారు. ఇకపోతే ఇటీవల బిగ్బాస్ ఇచ్చిన టాస్క్ లో విజయం సాధించి మానస్ బిగ్బాస్ హౌస్ కు కొత్త కెప్టెన్ గా మారిపోయాడు అన్నది అర్ధమవుతుంది.


  అయితే గత సీజన్ల తో పోల్చి చూస్తే ఇక ఈ సీజన్లో బిగ్ బాస్ హౌస్ లో ప్రేమ పావురాలు ఎక్కువగా కనిపించడం లేదు. ప్రస్తుతం ట్రాన్స్ జెండర్ గా హౌస్ లోకి వెళ్ళిన ప్రియాంక సింగ్.. మానస్ ల మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే మానస్ తో మాట్లాడకుండా కొన్ని నిమిషాలు కూడా ఉండటం లేదు. వీరిద్దరి మధ్య జరిగే గొడవలు.. ఒకరిపై ఒకరు చూపించుకునే కోపం బుల్లితెర ప్రేక్షకులను ఆకర్షించింది అని చెప్పాలి. అయితే అప్పుడప్పుడు ప్రియాంక పై మానస్ కోపం చూపించడం లాంటివి కూడా చేస్తూ ఉంటాడు.



 అయితే ఇటీవలే మానస్ ప్రియాంకకు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఇంకోసారి ఆ మాట మాట్లాడవు అంటే అమ్మతోడు చెబుతున్నా నీతో మాట్లాడటం మానేస్తాను అంటూ మానస్ వార్నింగ్ ఇవ్వడంతో పింకీ ఒక్కసారిగా షాక్ అయింది. నువ్వు చేసిన పని నాకు అస్సలు నచ్చలేదు అంటూ వార్నింగ్ ఇచ్చాడు మానస్ . ఇప్పటికే రెండు సార్లు అన్నావు.. ఇంకా ఒకసారి అలా అన్నావు అంటే చాలు ఇక నీతో మాట్లాడడం మానేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చాడు మానస్. మానస్ కు కోపం వచ్చేలాగా పింకీ  ఏమంది అన్న విషయం మాత్రం రివీల్ చేయలేదు. ఆ తర్వాత కోపం తగ్గిన తర్వాత పింకీ కి సారీ చెబుతాడు మానస్. దీంతో వయ్యారాలు పోతోంది పింకీ.

మరింత సమాచారం తెలుసుకోండి: