న్యాచురల్ స్టార్ నాని మరియు శివ నిర్వాణ కాంబినేషన్లు విడుదలైన టక్ జగదీష్ మూవీ రిజల్ట్ తో శివ నిర్వాణ డైరెక్ట్ చేయబోతున్నాడు కొత్త సినిమా ఆగిపోతుందని అంచనా వేశారు. కానీ  సక్సెస్ కి ఫెయిల్యూర్ కి ఏమాత్రం విలువ ఇవ్వని రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండ తన నెక్స్ట్ సినిమా ని శివ నిర్వాణ తో చేస్తున్నాడచేస్తున్నా అని అఫీషియల్గా అనౌన్స్ చేశాడు. దర్శకుడు శివ నిర్వాణ కూడా దానికి  గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
నిన్ను కోరి ఇ మజిలీ సినిమాలతో తన ప్రతిభను చాటుకున్నా దర్శకుడు శివ నిర్వాణ జగదీష్  సినిమా విషయంలో తన అంచనాలు తప్పినట్లు సమాచారం.


 అయితే తాజాగా రిలీజ్ అయిన జగదీష్ సినిమా ప్లాప్ ఎఫెక్ట్ దర్శకుడి పై పడింది. దర్శకుడు సాధారణ కథతో సినిమాను తెరకెక్కించడం తో పాటు స్టొరీ లో ఎన్నో లోపాలు ఉండటం సినిమాకు మైనస్ గా మారింది. సినిమాను చూసిన ప్రేక్షకులు చాలామంది ఈ సినిమాను బ్రహ్మోత్సవం సినిమా తో పోల్చారు.విజయ్ దేవరకొండ సినిమాతో మళ్లీ తన ప్రతిభను చాటాలని చూస్తున్న దర్శకుడు. విజయ్ ప్రస్తుతం జగన్నాథ్ డైరెక్షన్లో లైగర్ అనే మూవీలో చేస్తున్నారు.

 ఈ సినిమా తర్వాత విజయ్ శివ నిర్వాణ కాంబినేషన్లో సినిమా ఉంటుందని సమాచారం. మరి శివా తో చేయబోయే సినిమా కథ ఏంటి విజయ్ రూట్ లో దర్శకుడు తీస్తారా లేక దర్శకుడు రూట్లో విజయ్ చేస్తారా అనేది వేచి చూడాలి. కానీ దర్శకుడు శివ నిర్వాణ మాత్రం విజయ్ తో తన రాబోయే సినిమా  మీద చాలా ఫోకస్ గా ఉన్నారని తెలుస్తుంది. ఈ సినిమా ఫిబ్రవరి నుండి సెట్స్ మీదకు వెళ్తుంది అని సినీ వర్గాల అభిప్రాయం. మరి ఈ సినిమాతో దర్శకుడు శివ నిర్వాణ తన ప్రతిభను చాటుతాడు తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: