నటీనటులు - అభిన‌వ్ స‌ర్దార్‌, రామ్ కార్తీక్, సుమన్, శుభలేఖ సుధాకర్, చాందిని త‌మిళ రాస‌న్‌, శాని సాల్మన్‌‌, షెర్రీ అగర్వాల్ త‌దిత‌రులు..
సినిమాటోగ్ర‌ఫీ- జె. ప్ర‌భాక‌ర రెడ్డి
మ్యూజిక్ - భీమ్స్
ఫైట్స్‌- శంక‌ర్‌
నిర్మాత‌లు - అభిన‌వ్ స‌ర్దార్, వెంక‌టేష్ త్రిప‌ర్ణ
క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం- వెంక‌టేష్ త్రిప‌ర్ణ
సెన్సార్: U/A
రిలీజ్ డేట్: నవంబర్ 19, 2021

టాలీవుడ్ లో కొత్త కథలకు కాలం చెల్లింది. ఎవరు ఏ ఫార్ములా తీసి సక్సెస్ అయితే అదే ఫార్ములాని యథాతథంగా ఫాలో అవుతుంటారు మరికొందరు. ఈ క్రమంలో ఫార్ములాని పట్టుకున్నా కథ, కథనం కొత్తగా ఉంటే సినిమాలు సక్సెస్ అవుతాయి. లేకపోతే పాత వాసనతో పనికిరాకుండా పోతాయి. కానీ రామ్ అసుర్ అలాంటి సినిమా కాదు. కొత్త కథను టాలీవుడ్ కి పరిచయం చేశారు దర్శకుడు వెంకటేష్.

రామ్ అసుర్ (పీనట్ డైమండ్) సినిమా కథ మొత్తం ఓ వజ్రం చుట్టూ తిరుగుతుంది. దానితో ఇద్దరి జీవితాలు ముడిపడి ఉంటాయి. రామ్ (రామ్ కార్తీక్ ) వజ్రాన్ని కృత్రిమంగా తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ ఎంత ప్రయత్నించినా అతనికి ఫలితం ఉండదు. గర్ల్ ఫ్రెండ్ కూడా తనకి దూరం కావడంతో డిస్టర్బ్ అవుతాడు. వీటన్నిటినీ మరచిపోయి జీవితంలో స్థిరపడాలనే ఉద్దేశంతో రామాచారిని అనే వ్యక్తిని కలుస్తాడు. ఆయన సలహాతో సూరి (అభినవ్ సర్దార్) తో లావాదేవీ పెట్టుకోవాలని చూస్తాడు. సూరి, రామ్ పరిచయం ఎలాంటి మలుపు తీసుకుంది. పీనట్ డైమండ్ ని రామ్ తయారుచేశాడా లేదా? అనేది మిగతా కథ.

సహజంగా లభించే వజ్రాలను కృత్రిమంగా తయారు చేయడం అనే కొత్త కాన్సెప్ట్ తో ఈ సిినిమా తీశారు. కానీ తెరపైకి దీన్ని పగడ్బందీగా తీసుకొచ్చే క్రమంలో దర్శకుడు కొన్ని చిన్న చిన్న తప్పులు చేశాడు. బడ్జెట్ చక్రంలో ఇరుక్కుపోయినట్టు అర్థమవుతుంది. పేరున్న నటీనటులు లేకపోవడం కూడా సినిమాకి బలహీనతగా మారింది.

ఫస్టాఫ్ లో దర్శకుడు దృష్టంతా రామ్ కార్తీక్ పైనే ఉంటుంది. లవ్ ట్రాక్, రొమాన్స్ తో ఎక్కువ టైమ్ గడిపేస్తాడు. సెకెండాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ''రామ్ అసుర'' వేగం అందుకుంటుంది. ఈ విషయంలో దర్శకుడు వెంకటేష్ త్రిపర్ణ అందర్నీ మెప్పిస్తారు. సెకండాఫ్ నుంచి తన రైటింగ్ పవర్ చూపించారు కూడా.

నటీనటులు ఎలా చేశారంటే..?
రామ్ కార్తీక్ రొమాంటిక్ లవర్ బోయ్ లా కనిపించాడు. సూరి పాత్ర పోషించిన అభినవ్ సర్దార్ మెప్పిస్తాడు. సర్దార్ యాక్టింగ్ బాగుంది. షెర్రీ అగర్వాల్ గ్లామర్ గర్ల్ గా ఆకట్టుకోగా.. చాందిని తమిళ రాసన్ నటన ఆకట్టుకుంటుంది. రామాచారిగా శుభలేఖ సుధాకర్, బలరాం రాజుగా సుమన్.. మెప్పిస్తారు.

భీమ్స్ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. ప్రభాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, శంకర్ ఫైట్స్ అదనపు ఆకర్షణ అనే చెప్పాలి. కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ విభాగాలన్నింటిలో వెంకటేష్ త్రిపర్ణ మార్క్ కనపడుతుంది. ఈ మల్టీస్టారర్ కథకు పేరున్న నటీనటులు పడి ఉంటే.. మరో లెవల్ లో ఉండేదని చెప్పొచ్చు.

ప్లస్ పాయింట్స్
- కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్
- దర్శకత్వం
- బ్యాక్ గ్రౌండ్ స్కోర్
- సర్దార్ నటన

మైనస్ పాయింట్స్
- ఫస్టాఫ్ స్లో గా ఉండటం
- విసుగు తెప్పించే రొమాంటిక్ ఎపిసోడ్స్

రేటింగ్ : 2.5/5

మరింత సమాచారం తెలుసుకోండి: