ప్రీతమ్ జుకాల్కర్ పేరు వింటేనే తెలుగు రాష్ట్రాల ప్రజల్లో కోపం కట్టలు తెంచుకుంటుంది. ఎందుకంటె సమంత - నాగ చైతన్యల విడాకుల వ్యవహారం లో అతని పాత్ర ఎక్కువగా ఉందని అంత అనుకుంటున్నారు కాబట్టి. సమంత తో ప్రీతమ్ జుకాల్కర్ ఎక్కువగా సన్నిహితంగా మెలిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి కూడా. ఆ కారణం చేత సమంత , నాగచైతన్య ఫాన్స్ అతడికి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు.



IHG ఆ తరువాత దెబ్బకి సమంత నా సిస్టర్ అంటూ కుండ బద్దలు కొట్టాడు కూడా. అంతే కాకుండా నాగ చైతన్యకు ఈ విషయం తెలుసు అంటూ వివరణ కూడా ఇచ్చాడు. అప్పటి నుండి దేశమంతటా అతని పేరు మారుమ్రోగిపోతూవుంది. అయితే ప్రీతమ్ జుకాల్కర్ మెగా డాటర్ పై చేసిన కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
IHG
మెగాస్టార్ చిరంజీవి ముద్దుల కుమార్తె శ్రీజ పుట్టిన వేడుకలు సంబరంగా జరిగాయి. శ్రీజ పుట్టిన రోజు సందర్భంగా పలువురు ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీజ తన పుట్టిన రోజు సందర్భంగా తీసిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతే కాకుండా తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపింది  తెలిపింది శ్రీజ.


IHG

అయితే ఆమె కృతజ్ఞతలు తెలుపుతూ చేసిన పోస్ట్ కి ప్రీతమ్ జుకాల్కర్ ఓ ఆసక్తి కార కామెంట్ పెట్టాడు . ఆ పోస్ట్ లో ప్రీతం " సుందర్ లడికీ " (అందమైన అమ్మాయి) అని కామెంట్ చేశాడు. దింతో సోషల్ మీడియాలో ఈ విషయమై ఆసక్తికరమైన చర్చ చోటుచేసుకుంది. స్టైలిష్ గా ఉన్న ప్రీతమ్ కు మెగా ఫ్యామిలీతో మంచి సంబంధాలు ఉన్నాయ్ కాబట్టి ఆలా కామెంట్ పెట్టి ఉంటాడని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: